త్రినేత్రధారుడిగా
భోళా శంకరుడిగా
అర్థనారీశ్వరుడిగా
గంగా సమేతుడిగా
ఉమామహేశ్వరుడిగా
లింగాకృతి ధారుడిగా
తల్లి దండ్రులను సేవిస్తే
ముల్లోకాలను
దర్శించినట్లని
గణేషునికి మార్గం చూపి
విజ్ఞాదిపత్యం ఒసంగి
కుమారస్వామిని
సైన్యాధ్యక్షుడ్నిచేసి
ఆది మధ్యాంత రహితుడై
బ్రహ్మా విష్ణువులకు
కళ్ళుతెరిపించిన
సృష్టి, స్థితి, లయకారకా ఈశ్వరా !
ఇవే నా సాష్టాంగ
ప్రణామాలు.
***********************************
అమ్మ
నవమాసాలు మోసి కంటుంది
చనుబాలతో కడుపు నింపుతుంది
పొత్తిళ్ళలో లాలిస్తుంది
కేరింతల మధ్య ఆనందిస్తుంది
జోల పాటలతో నిద్రపుచ్చుతుంది
నీ ప్రగతిలో ఆయుష్షును మర్చిపోతుంది
కొవ్వొత్తిలా కరుగుతూ వెలుగునిస్తుంది
వయసులో బిడ్డకు పెళ్ళి చేసింది
పెళ్ళితో బిడ్డకు దూరమయ్యింది
మాటల తూటాలచే మమకారం గాయమయ్యింది
ఈసడింపుల్లో మనసు నలిగి పోయింది
వృద్ధాప్యం అమ్మ పాలిట శాపమయ్యింది
ఇంటి నుండి అమ్మగెంటబడింది
అందరూ వుండి అమ్మ ఒంటరయ్యింది
శరణాలయమే అమ్మకు రక్షణ అయ్యింది
******************************
అమ్మ
నవమాసాలు మోసి
పురిటినొప్పులు భరించి
పండంటిబిడ్డకు జన్మనిచ్చి
అమ్మైనందుకు ఆనందిస్తుంది
బిడ్డను చేతుల్లోకి తీసుకుంటూ
గుండెలకు హత్తుకుంటూ
నుదుటిపై ముద్దాడుతూ
బాధలన్నీ మర్చిపోతూ
ఆనంద పారవశ్యంలో ఓలలాడుతూ
చనుబాలను అందిస్తూ, పొత్తిళ్ళలో లాలిస్తూ
ఊసులు చెబుతూ నిద్రపుచ్చుతుంది
బిడ్డ ఆలనా పాలనకై
కాలమంతా వెళ్ళబుచ్చుతుంది
అమ్మా అన్న బిడ్డ పిలుపుకు
తల్లి మనసు పులకించి పోతుంది
తాను కొవ్వొత్తిలా కరుగుతూ
చిన్నారి భవితకై పరితపిస్తూ
అమ్మా అనే పదానికి నూరుశాతం న్యాయం చేస్తుంది.
అమ్మా అనే పదానికి నూరుశాతం న్యాయం చేస్తుంది.
********************************
మదర్స్ డే
నవమాసాలు మోసేది అమ్మ
పురిటినొప్పులు భరించేది అమ్మ
చనుబాలు అందించేది అమ్మ
పొత్తిళ్ళలో ఆడించేది అమ్మ
జోలపాటలు పాడేది అమ్మ
నలతగా ఉంటే తల్లడిల్లేది అమ్మ
సపర్యలు చేసేది అమ్మ
ఓనమాలు నేర్పేది అమ్మ
భవిష్యత్తుకై పరితపించేది అమ్మ
ప్రయోజకులైతే ఆనందించేది అమ్మ
బాధల్ని గుండెల్లో దాచుకునేది అమ్మ
ఎంత చేస్తున్నా ఛీత్కారాలు పొందేది అమ్మ
అవమానాలు, నిందలు భరించేది అమ్మ
అన్నీ భరించటానికే జన్మించిందా? అమ్మ
ప్రేమకు కేరాఫ్ అడ్రస్సేగా అమ్మ
ప్రేమను అందించలేరా అమ్మకు
కాగితాలకే పరిమితమా మదర్స్ డే
***************************
నాన్న
కుటుంబానికి యజమానియై
సంసారాన్ని ఒంటి చేత్తో నడిపిస్తూ
అందరి అవసరాలు తీరుస్తూ
ఆర్థిక ఇబ్బందులు వేధిస్తున్నా
మోముపై చిరునవ్వు చెరగనివ్వక
మానసిక, శారీరక చిత్రవధకు లోనౌతున్నా
అందరికి అండగా నిలుస్తూ
పరువు మర్యాదల్నిగుప్పెట్లో పెట్టుకొని ,
లేమి తనాన్ని కప్పిపుచ్చుతూ
గంభీరంగా, గుంభనంగా కనిపిస్తూ
ఆడపిల్ల ఆడపిల్లే అని తెలిసినా
అల్లారు ముద్దుగా పెంచిన కూతుర్ని
రంగరంగవైభవంగా పెళ్ళి చేసి
వరుడి చేతి కందిస్తూ
కన్నీళ్ళను కళ్ళలో కన్పించకుండా
రెప్పచాటున దాచిపెడుతూ
ఉబికి వస్తున్న
దు:ఖాన్నిగుండెల్లో అదిమిపెడుతూ
కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ
మెట్టినింటికి సాగనంపుతాడు
పున్నామ నరకం నుండి తప్పిస్తాడన్న నమ్మకంతో
ఆయురారోగ్యాలను లెక్కచేయక
ఉన్నదంతా ఊడ్చి చదివించి
కొడుకును ప్రయోజకుడ్ని చేస్తాడు
సొంత ఇంటిలో అయిన వారి మధ్యన
శేష జీవితం గడపాలని పరితపిస్తూ
తన కల నెరవేరాలని ఆశిస్తాడు
జన్మనిచ్చిన జనకుడు.
****************************************
భార్య
తల్లి చాటున బిడ్డకు
తండ్రి కన్యాదానం చేసి
వరుడి చేతికందిస్తే
అన్నీ చూడాల్సిన భర్త
పనీపాట చేయక
సంసార భారం మోయక
ఏమి పట్టనట్లుగా వుంటూ
వ్యసనాలకు దాసుడై
పరాన్నజీవిలా బ్రతుకుతుంటే
పరువు మర్యాదలు ప్రక్కనబెట్టి
సంసార భారాన్ని భుజానెత్తుకొని
పనికోసం గుమ్మం దాటి
రెక్కలు ముక్కలు చేసుకొని
కూలి డబ్బులు చేత పట్టుకొని
సందేళకు ఇల్లు చేరిన ఇల్లాలిని
జల్సాలకు డబ్బివ్వమంటూ
శారీరక, మానసిక చిత్రహింసలు పెడుతుంటే
చావలేక, వదలలేక
పిల్లల భవిష్యత్తుకై
బాధల్ని గుప్పెట్లో పెట్టుకొని
బ్రతుకు బండిని ఈడుస్తూ
పెనిమిటిలో మార్పు రావాలని
ఆశల హరివిల్లులో బ్రతుకుతుంది
మన మధ్య తరగతి ఇల్లాలు
***************************
పని మనిషి
కోడికూతతో గుమ్మందాటి
మరో ఇంటి తలుపు తట్టి
పని మనిషిగా విధులు చేపట్టి
మాటల ఈసడింపుల మధ్య
బాధ్యతల్ని చక్కదిద్ది
కష్టనష్టాలు తాననుభవిస్తూ
కోరికలను ముని పంటి క్రింద చిదిమేస్తూ
రాని నవ్వును ముఖాన పూసుకొని
జీతం డబ్బులు పుచ్చుకొని
మిగిలిన అన్నం మూట కట్టుకొని
సందేళకు ఇల్లు చేరుకొని
ఎదురు చూసే పిల్లల్ని చూసి
కష్టమంతా మర్చిపోయి
తెచ్చిన అన్నం పిల్లలకు పెట్టి
గంజినీళ్ళతో కడుపు నింపుకొని
కోడికూత కోసం ఎదురుచూస్తూ
నిద్రలోకి జారుకుంటుంది
నిద్రలోకి జారుకుంటుంది
***********************
సగటు మనిషి
సగటు మనిషి బ్రతుకు
ఒంటరి పోరాటంలో
యాంత్రిక జీవనంలో
చిక్కిశల్యమయ్యింది
ఉద్యోగ బాధ్యతల నడుమ
ఉరుకులు పరుగులు పెడుతూ
అయిన వారితో ఆనందంగా
స్నేహితులతో సరదాగా
గడపలేని బడుగుజీవి
చాలీచాలని జీతాలతో
కడుపు నింపలేక
సరదాలు తీర్చలేక
మనః సాక్షిని చంపుకోలేక
దుర్భర జీవితం గడుపుతూ
బ్రతుకు బండి లాగుతున్నాడు
మన మధ్య తరగతి మానవుడు
************************
సైనికుడు
దేశ రక్షణే ముఖ్యమని
ఆలు బిడ్డలను వదిలేసి
సైనిక కూటంలో చేరితివి
సరిహద్దుల్లో నీ వుండి
అనురాగాన్నే మరిచితివి
కష్టనష్టాలు నీ చెంత
ఆనందమే లేదు నీ ఇంట
సరిహద్దుల్లో పొరపాట్లు
చేజారును ఆయుష్షు
శోకసముద్రంలో నీ ఇల్లు
తేరుకోలేదు నీ ఇల్లాలు
గతించి పోవును నీ కీర్తి
మారిపోవును నీ ఇంటిగతి
*********************
రైతు
దేశానికి వెన్నెముక
మనందరికి అన్నదాత
మనందరి రైతన్న
అన్ని రంగాలకు అతడే ఆధారం
అన్ని ప్రాణులకు అతడే జీవనాధారం
అతడి శ్రమే మనకాదర్శం
*******************************
బిచ్చగాడు
ఆకలి
తీర్చే అమ్మలేక
అవసరాలు తీర్చే నాన్నలేక
అక్కున
చేర్చుకునే దిక్కులేక
ఆకలి
పొలికేకలు పెడుతుంటే
అన్నమో
రామచంద్రంటూ
జానెడు
పొట్టకోసం
గుప్పెడు
మెతుకుల కోసం
చింపిరిజుట్టుతో
మాసిన
చిరిగిన బట్టలతో
పిచ్చి
చూపులతో
విచిత్రపు
చేష్టలతో
తనలో
తాను నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ
వీధులన్నీ
తిరుగుతూ
చెత్తకుండీలన్నీ
వెతుకుతూ
కనిపించిన
అన్నంకోసం
వరాహ, శునకాలతో పోటీపడి
అన్నాన్ని
దొరకపుచ్చుకొని
రోడ్డు
ప్రక్కనే చతికిలపడి
ఆవరావురంటూ భోంచేస్తూ
క్షుద్బాదను తీర్చుకుంటూ
క్షుద్బాదను తీర్చుకుంటూ
వీక్షకులకు వింతగా అగుపిస్తాడు బిచ్చగాడు
*************************************
చెల్లెలు
నా చెల్లెలు వాణి
ఒంటికి చుట్టింది ఓణి
కొప్పులో పెట్టింది మల్లి
జడకు కట్టింది కుప్పి
చెవికి పెట్టింది కమ్మి
ముక్కుకు పెట్టింది బేసరి
మెడలో వేసింది పసిడి
కాళ్ళకు పెట్టింది పట్టి
చేతికి కట్టింది రాఖీ
కళ్ళముందున్న బంగారు తల్లి
నా ఇంట్లో వున్న శ్రీమహాలక్ష్మి
****************************
****************************
స్త్రీ ఔన్నత్యం
బిడ్డగా ముద్దొస్తుంది
నేస్తమై నడిపిస్తుంది
నేస్తమై నడిపిస్తుంది
ప్రియురాలై మనసిస్తుంది
భార్యగా సుఖపెడుతుంది
తల్లిగా లాలిస్తుంది
కోడలిగా భరిస్తుంది
అత్తగా శాసిస్తుంది
సుఖ దుఃఖాలలో తోడౌతుంది
వార్ధక్యంలో అన్నీ తానౌతుంది
****************************
పరిపూర్ణ జీవితం
తప్పటడుగుల బాల్యం
కోరికల కౌమారం
బాధ్యతల యవ్వనం
గతస్మృతుల వృద్ధాప్యం
ఇదే నిండైన మానవుని జీవితం
***********************
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి