ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

దేశం - రాష్ట్రం - తెలుగు భాష ఔన్నత్యం

మన దేశం

భారత దేశం మన దేశం

శత్రు దుర్భేద్యమైనది భారతదేశం

అలీన రధసారధి మన దేశం
శాంతి సమానత్వ సౌభ్రాతృత్వం గలది మన దేశం
లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మన దేశం
భిన్నత్వంలో ఏకత్వ స్వరూపమే మన దేశం
చారిత్రక కట్టడాల నిలయం మన దేశం
కళలకు పుట్టినిల్లు మన దేశం
నవరసాల మేళవింపు మన దేశం
పున్నమి నాటి చంద్రుని వంటిది మనదేశం
మన దేశం భారత దేశం
------------------------------------------------------
ఈ దేశం మనది

భారతదేశ దాశ్య శృంఖలాలు తొలగించడానికి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి భగత్ సింగ్ నేతాజీ వంటి వారు ఆయుధాలు ధరించి విడివిడిగా యుద్ధాలు చేసి ప్రాణాలు విడిచారు
కొందరు మితవాదులు కరపత్రాల ద్వారా నినాదాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా ఫలితం శూన్యం
లాల్ బాల్ పాల్ వంటి అతివాదులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు కారణం విడివిడిగా పోరాడటమే
ఆయుధం ధరించిన వాడు ఆయుధంతోనే మరణిస్తాడనే విషయం గ్రహించిన గాంధీజీ సత్యం అహింస శాంతి అనే ఆయుధాలు ధరించి డూ ఆర్ డై అనే నినాదంతో ప్రజలందరిలో స్వాతంత్య్ర కాంక్షను రగుల్కోపి ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపండంటు ఒకే త్రాటిపై నడిపిస్తు నినాదాల ద్వారా ఉద్యమాల ద్వారా ఉపన్యాసాల ద్వారా స్వాతంత్య్ర పోరాటాలు చేసి స్వాతంత్య్రం సాధించారు గాంధీజీ
దానికి కారణం ఆ సేతు హిమాచలమంతా ఒకే మాటపై నిలబడి ఉండటమే
కానీ నేడు కులాల పేరుతో మతాల పేరుతో ప్రాంతాల పేరుతో భాషాభిమానంతో దేశాన్ని అగ్ని గుండంగా మారుస్తూన్నారు కాబట్టి గాంధీజీ కన్న కలల్ని నిజం చెయ్యాలంటే ఆందరం కలిసి పలుకుదాం భారత్ మాతాకి జై అందాం ఈ దేశం మనదని చాటి చెబుదాం

-----------------------------------------------------
ఆగ్రాలో  చర్చలు
ప్రజాస్వామ్యాన్ని ఇనుప చట్రంలో బిగించి
నిరంకుశ ప్రభుత్వాన్ని చేబూని
దెయ్యాలు వేదం వల్లించినట్లు
వల్లిస్తున్నారు ప్రజాస్వామ్యం గుర్చి
కార్గిల్ తో పొందలేని కాశ్మీర్ ను
చర్చలతో పొందాలని చూస్తున్నారు
విభజించు పాలించు విధానంతో
అందుకోబోతున్నాడు కాశ్మీర్ ను
చెప్పేవి శ్రీ రంగ నీతులు - - - - - అన్నట్లు
పలుకుతున్నారు చిలుక పలుకులు
నివురు గప్పిన నిప్పు ఓలే
శాంతి శాంతి అంటూనే
మనలో నింపుతారు అశాంతి
ఏకులా వచ్చి మేకవ్వనున్నారు ముషారఫ్
జాగ్రత్తతో మెలగాలి భరతావని
-----------------------------------------------------
చేయి చేయి కలుపుదాం - సమైక్యాంధ్రకు జై అందాం
ప్రాంతాల కుమ్ములాటలో
విద్యార్థులు పావులై
నాయకుల చేతిలో కీలుబొమ్మలైరి
స్వార్థం కోసం, పదవుల కోసం
నియంతలుగా మారిన నాయకులు
రాష్ట్ర విభజన కావాలంటూ
పరిపాలనను సాగనివ్వక
రాష్ట్ర ప్రగతిని గాలికొదిలేసి
సంస్కృతిని పాతాళానికి నెట్టేసి
గత చరిత్రను తుంగలో తొక్కేసి
కవుల విగ్రహాలను ధ్వంసం చేసి
పరువు మర్యాదలు బజారు కీడ్చి
రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మారుస్తూ
హరితాంధ్రప్రదేశ్ ను
మరుభూమిగా మారుస్తున్న
చదువుకున్న అజ్ఞానులు వీరు
మూర్ఖులుగా ప్రవర్తిస్తూ
సమైక్యాంధ్రను ముక్కలు చేస్తున్నారు
కళ్ళు తెరవండి నిజం గ్రహించండి
సమైక్యాంధ్ర రక్షణకై చేయిచేయి కలపండి
స్వార్ధపరులను తరిమికొట్టండి
----------------------------------------------------
రాష్ట్ర విభజన కోరే నాయకులారా
రాష్ట్ర విభజన జరిగితే
దిగువ ప్రాంతాలకు నీళ్ళందక పోతే
ప్రాజెక్టులు వెలవెల పోయి
కరెంటు ఉత్పత్తి నిలిచిపోయి
పాడిపంటలు దెబ్బతింటాయి
చెట్లు చేమలు ఎండిపోయి
సమస్త జీవరాశులు మలమలా మాడిపోతాయి
పంటలు పండక భూములు బీడులౌతుంటే
అప్పుల పాలైన రైతులు
పొలాలు అమ్మేవారు కొందరు
పనులకై వలస వెళ్ళేవారు మరికొందరు
ఆత్మహత్యలు చేసుకునేవారింకొందరు
కరెంటు లేకపోతే
రాష్ట్రం అంధకారమౌతుంది
అన్నిరంగాలలో పనులు ఆగిపోతాయి
ముడిసరుకులు లేక
పరిశ్రమలు, కర్మాగారాలు మూతబడతాయి
పనులు లేక కూలీలు, ఉద్యోగాలు లేక అక్షరాస్యులు
డబ్బు కోసం, జానెడు పొట్ట కోసం
సంఘ వ్యతిరేక పనులు గావిస్తూ
సంఘ విద్రోహశక్తులుగా మారతారు
దోపిడీ వ్యవస్థ రాజ్యమేలుతూ- ధరలు పెంచేస్తుంటే
సామాన్యులు కొనలేక
తింటానికి తిండిలేక - త్రాగటానికి నీరులేక
ఆకలి పొలికేకలు పెడుతుంటే
దారిద్ర్యం విలయతాండవం చేస్తుంటే
కరువు కరాళనృత్యంచేస్తుంటే
వ్యాధులు రాబంధులై కబళిస్తుంటే
సహనం చచ్చిపోయి- మానవత్వం మర్చిపోయి
ఆందోళనలు, ఉద్యమాలు గావిస్తుంటే
శాంతి భద్రతలు అడుగంటి - పరిపాలన జరగక
రాష్ట్రాభివృద్ధి కుంటుపడి -
రాష్ట్రం మరుభూమిగా మారుతుంది
స్వార్థాన్ని, పదవీ వ్యామోహాన్ని వీడి
రాష్ట్ర భవిష్యత్తును గుర్తెరిగి
రాష్ట్ర విభజనకు స్వస్తి పలికి
సమైక్యాంధ్రకు జై అంటూ
చేయి చేయి కలిపి అడుగు ముందుకేద్దాం
కలిసి పని చేద్దాం
అమరజీవి ఆశయాన్ని కాపాడుకుందాం
సంపూర్ణ రాష్ట్రాన్ని సాధించుకుందాం
అన్నదమ్ముల్లా కలకాలం ఒక్కటిగా జీవిద్దాం
-------------------------------------------------------

మాతృభాషను కాపాడుకుందాం
నాడు ప్రాచీన హోదా కల్గి
అజంతా భాషగా నిలిచి
ఆదికవి నన్నయచే ప్రాణం పోసుకొని నం
ఎందరో మహానుభావులచే పెరిగి పెద్దదై
దేశ భాషలందు తెలుగు లెస్సంటూ
రాయలచే కీర్తించ బడినదై
ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టంటూ
విదేశీయులచే కొనియాడబడిన భాష
ఆంధ్రుల మాతృభాష తెలుగు భాష
నేడు తల్లి పాలలోని కమ్మదనం రుచించక
దాది పాలకై వెంపర్లాడుచున్న బిడ్డల్లా
మాతృభాషను నిర్లక్ష్యం చేస్తూ
పరభాషా వ్యామోహంలో పడి
రెంటికి చెడ్డ రేవడిలా మారి
త్రిశంకు స్వర్గంలో చిక్కుకున్నారు తెలుగువారు
ఆంధ్రులు ఆరంభ శూరులేకానీ -- అన్న సామెతలా
భాషా పరంగా ఏర్పడ్డ తొలిరాష్ట్రమైనా
భాషాభివృద్ధిలో మలి రాష్ట్రమయ్యింది
ఇకనైనా కళ్ళు తెరిచి నిజం గ్రహించండి
సైమన్ గో బ్యాక్ అంటూ
గుండుకు గుండె చూపిన ప్రకాశంలా
చేయండీ లేక చావండంటూ
స్వాతంత్ర్యాన్నందించిన గాంధీజీలా
ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ
ప్రాణాలర్పించిన శ్రీరాములులా
మాతృభాషాభివృద్దికై చేయి చేయిూ కలిపేస్తూ
పదం పదం పలికేస్తూ
అడుగు ముందు కేస్తూ
తెలుగు భాష ఔన్నత్యాన్ని అందరికి వివరిస్తూ
తెలుగు వారమని సగర్వంగా తలెత్తుకు నిలబడదాం
మన మాతృభాపైన తెలుగు భాషను కాపాడుకుందాం
************************************
తెలుగు భాష ఔన్నత్యం
తేనెలూరు భాష మనది
జనని అందించిన భాషది
స్వీకరించు మన అజంతభాష
నేర్చుకో మన ప్రాచీన భాష
తేజస్సు నందించు భాష
ప్రపంచ ఖ్యాతి నందించు భాష
ఉన్నత శిఖరాల నందించు భాష
మన మాతృభాష తెలుగు భాష 
ఆంధ్రుడా ఎగరెయ్యి తెలుగు భాషా ధ్వజం
దశదిశలా వ్యాపించును తెలుగు తేజం 
ప్రపంచ దేశాలకు తెలియును తెలుగు ఔన్నత్యం 
------------------------------------------------------------
తెలుగు భాషా వికాసం
తెలుగు భాషను అభివృద్ధి పర్చటంలో ప్రాచీన మరియు ఆధునిక కవులు స్వతంత్ర రచనలతో పాటు ఇతర భాషలలోని రచనల్ని తెలుగులోకి అనువాదించి వాటిలోని ఎన్నో విషయాల్ని ప్రజలకందించిన ప్రముఖ కవుల గురించి తెలుసుకుందాం
వ్యాసుడు సంస్కృతంలో భారత భాగవతాలు వ్రాయగా నన్నయ తిక్కన ఎర్రనలు భారతాన్ని పోతన భాగవతాన్ని తెలుగులోకి అనువదించినారు
వాల్మీకి సంస్కృతంలో రామాయణం వ్రాయగా తెలుగులోకి అనేకమంది కవులు వాల్మీకి రామాయణం లో లేని అనేక అంశాలను వారు వ్రాసిన రామాయణాలలో వ్రాయటం జరిగింది (గుహుడు రాముని కాళ్ళు కడగటం, అహల్య రాయిగా మారటం, లక్ష్మణుడి నవ్వు)
కాళిదాసు సంస్కృతంలో వ్రాసిన కుమారసంభవాన్ని నన్నేచోళుడు తెలుగులోకి అనువదించారు
దండి వ్రాసిన దశకుమారచరిత్రను కేతన తెలుగులోకి
అనువదించెను
రాజశేఖరకవి వ్రాసిన విద్దసాలభంజికను మంచన కేయూరబాహుచరిత్ర పేరుతో తెలుగులోకి అనువదించారు
హలుడు వ్రాసిన గాధాసప్తశతిని శ్రీనాధుడు శాలివాహన సప్తశతి పేరుతో తెలుగులోకి అనువదించారు
భర్తృహరి సంస్కృతంలో వ్రాసిన సుభాషిత త్రిశతిని ఎలకూచి బాలసరస్వతి పుష్పగిరి తిమ్మన ఏనుగు లక్ష్మణకవి వంటి వారు తెలుగులోకి అనువదించారు
విష్ణు శర్మ వ్రాసిన పంచతంత్రాన్ని చిన్నయసూరి మిత్ర లాభం మిత్ర బేధం పేరుతో తెలుగులోకి అనువదించారు
శ్రీ కృష్ణ దేవరాయల కవే కాక అష్టదిగ్గజ కవుల్ని పోషించి వారి చేత అనేక ప్రబంధాలు వ్రాయించారు తెలుగు భాష అజంత భాష మరియు ప్రాచీన హోదా కలిగిన భాష ఇట్టి భాషను శ్రీనాధుడు మరియు శ్రీ కృష్ణ దేవరాయల దేశ భాషలందు తెలుగు లెస్స అని అనగా విదేశీయులు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని కీర్ర్తించారు
సి. పి. బ్రౌన్ గారు తెలుగు భాషాభిమాని అవ్వడం వల్ల సుమతీ వేమన పద్యాలను సేకరించి వాటిని ముద్రించి ఇంగ్లీషు భాషలోకి అనువదింపచేసి పరోక్షంగా తెలుగు భాషాభివృద్ధికి కృషి చేశారు
మాండలిక భాషాభివృద్ధి కోసం కాళోజి వారాయణ రావు ఎంతగానో కృషి చేసినందుకు ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 9ని మాండలిక భాషాదినోత్సవంగా ప్రకటించారు
గురజాడ, చిలకమర్తి, కందుకూరి వంటి వారు ఇంగ్లీషు లోని రచనల్ని తెలుగులోకి అనువాదించారు
అంతేకాదు వీరు ప్రాకృత భాషపై ధ్వజమెత్తి శుద్ధ వ్యవహారిక భాషలో రచనలు చేశారు సామాన్యులు సైతం నిఘంటువు సహకారం లేకుండా చదువుకునే విధంగా రచనలు వ్రాశారు
గిడుగురామ్మూర్తి గారు తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసినందుకు ఆయన పుట్టిన రోజైన ఆగస్టు 29ని మాతృభాషా దినోత్సవంగా ప్రకటించారు
శ్రీ శ్రీ ఆరుద్ర కరుణశ్రీ దాశరథీ దేవులపల్లి వేటూరి తిలక్
వంటి వారు గురజాడ వారి అడుగుజాడల్లో నడిచి ఎన్నో రచనలు చేశారు
సి. నారాయణరెడ్డి గారితో పాటు ఎందరో కవులు కృషి చేస్తున్నారు తెలుగు అధికార భాషా సంఘం మరియు ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా తెలుగును అభివృద్ధి చేస్తున్నారు అంతేకాదు 10వతరగతి వరకు నిర్బంధ తెలుగు విద్యను అమలు చేశారు
ఎవరో వస్తారని తెలుగును అభివృద్ధి చేస్తానని అనుకోకుండా ప్రతి ఒక్కరూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చెయ్యాలి
అలాగే ప్రతి తల్లి తన పిల్లలకు ఉగ్గుపాల నుండే తల్లి పాలకమ్మదనాన్ని మరియు మాతృభాష గొప్పతనాన్ని వివరిస్తు తెలుగును నేర్పించాలి అంతే కాని తెలుగును చిన్న చూపు చూడకూడదు
ఎన్ని దేశాలు తిరిగినా మాతృదేశానికి సాటిరావు
ఎంతమంది ఉన్నా మాతృమూర్తికి సాటిరారు
ఎన్ని భాషలు నేర్చినా మాతృభాషకు సాటిరావు అన్నది అక్షర సత్యం అప్పుడే తెలుగు భాష పదికాలాల పాటు సజీవంగా నిలువగలదు 













కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శతక లక్షణాలు, శతక కవులు

 శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108) శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి  200లపద్యాలు, పంచశతి  500ల పద్యాలు,సప్తశతి  700ల పద్యాలు  2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు)  3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం)  4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం  5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు 6. ఆత్మాశ్రయభావన నియమం  7. ఉదాహరణలతో  వివరించటం  పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు .1) భక్తి 2) శృంగార 3) నీతి  4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా  8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర  11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక  13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు                    * శతక కవులు * 1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం   సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర  2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం,  వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం  3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ...

చెలి నీవెవరు

ముందుమాట " చెలి నీ వెవరు " అనే కవితా సంపుటి నిశీధివేళ ఒంటరిగా నేను స్వప్నంలో విహరిస్తుంటే మేలి జలతారు ముసుగులో తాను తారసపడి నాతో నడుస్తూ ఎన్నో ఊసులు చెబుతూ ఒంటరి తనాన్ని దూరంచేస్తూ నేనున్నానని బాస చేసి ప్రాతః సమయాన నన్ను నిద్రలేపి మాయమయ్యేది. తన మాటల్లోని భావాలను తన సుందర రూపాన్ని గుర్తు చేసుకుంటూ అరుణోదయాన అక్షరరూపం కల్పిస్తూ తనను కవితల్లో చూసుకుని మురిసిపోతూ నా దినచర్యను కొనసాగి స్తూ రాత్రి ఎప్పడౌతుందా అని ఎదురుచూస్తూ కనిపించని మనిషిని అన్వేషిస్తూ ఈ కవితా సంపుటిని వ్రాయటం జరిగింది. ఇట్లు , మీ యేటూరి మురళీకృష్ణ కుమార్ ********************************************** నేనెవరో తెలుసా పారే సెలయేరు నడుగు పండు వెన్నెల నడుగు చల్లగాలి నడుగు పరవశించే ప్రకృతి నడుగు గానానికి మైమరచిన గోవుల నడుగు గోవర్ధనగిరి నడుగు ఆరాధించే గోపికల నడుగు నన్ను ప్రేమించిన రాధ నడుగు అందరి ఆరాధ్య దేవుడిని నేను   మీ మురళీ కృష్ణుడిని నేను ***************************** చెలీ నీవెవరు ? నీ మోము చూస్తే పున్నమి నాటి చంద్రుడ్ని తలపిస్తోంది నీ నవ్వులోని స్...