శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108)
శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి 200లపద్యాలు, పంచశతి 500ల పద్యాలు,సప్తశతి 700ల పద్యాలు
2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు)
3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం)
4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం
5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు
6. ఆత్మాశ్రయభావన నియమం
7. ఉదాహరణలతో వివరించటం
పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు
.1) భక్తి 2) శృంగార 3) నీతి
4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా
8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర
11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక
13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు
* శతక కవులు *
1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం
సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర
2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం,
వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం
3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ శతకం
మకుటం : సుమతీ, రచన :నీతిశాస్త్ర ముక్తావళి,
బిరుదు : కమలాసన
4. తిక్కన : 13వ శతాబ్దం, కృష్ణ శతకం, రచనలు : భారతం, నిర్వచనోత్తర రామాయణం, బిరుదులు : కవిబ్రహ్మ, ఉభయకవి మిత్రుడు
5. పోతన : 15వ శతాబ్దం, నారాయణ శతకం, రచనలు : భాగవతం, భోగినీ దండకం, వీరభద్ర విజయం, బిరుదు :సహజకవి, ఆంధ్ర జయదేవుడు
6. తాళ్ళపాక అన్నమయ్య : 15వ శతాబ్దం, వేంకటేశ్వర శతకం, రచనలు : వెంకటాచల మహాత్మ్యం, సంకీర్తనాలక్షణం, శృంగార మంజరీ బిరుదులు : పదకవితాపితామహుడు, వాగ్గేయకారుడు, సంకీర్తనాచార్యుడు
7. తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యులు : 16వ శతాబ్దం, వేంకటేశ శతకం, మకుటం : కలిత లక్ష్మీశ సర్వజగన్నివేశ విమల రవికోటి సంకాశ వేంకటేశ
8.దూర్జటి : 16వ శతాబ్దం, శ్రీకాళహస్తీశ్వర శతకం,మకుటం :శ్రీకాళహస్తీశ్వర రచన : శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం
9.పక్కి అప్పలనరసయ్య :(వెంకట నర్సయ్య or వెంకట నరసింహకవి) 16వ శతాబ్దం, కుమారీ, కుమార శతకాలు, మకుటాలు : కుమారీ, కుమార
10. గువ్వల చెన్నడు : (పట్టాభి రామకవి) 16వ శతాబ్దం, గువ్వలచెన్న శతకం,మకుటం : గువ్వలచెన్న
11 మారదవెంకయ్య : 17వ శతాబ్దం, భాస్కర శతకం, మకుటం : భాస్కర.
12.రామదాసు :( కంచర్ల గోపన్న) 17వ శతాబ్దం, దాశరథీ శతకం, మకుటం : దాశరథీ కరుణా పయోనిధీ
13. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి : 17వ శతాబ్దం హంసకాళికాంబ శతకం, రచనలు : కాళికాంబ సప్తశతి, కాలజ్ఞానం, సిద్ధబోధం, కాళీమకుట కందాలు బిరుదు : కాలజ్ఞాని
14. వేమన : ( పైడిపాల పుల్లారెడ్డి) 17వ శతాబ్దం,
వేమన శతకం, మకుటం :విశ్వదాభిరామ వినురవేమ
బిరుదులు : విప్లవకవి, ప్రజాకవి, తిరుగుబాటు కవి
ఈయన పద్యాలను ఆటవెలది ఛందస్సులో వ్రాశారు
15. ధర్మపురి శేషప్పకవి : (1750 - 1800)
నరసింహ శతకం, మకుటం :భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్టసంహార దురితదూర, రచన : నృకేసరి శతకం
16. చిదంబరశాస్త్రి : దారుణ శతకం, మకుటం : దారుణమా నీకు నమస్కారము మకుటం మొదటి పాదంలో ఉంటుంది
17.కాసుల పురుషోత్తమకవి : ఆంధ్రనాయక శతకం,హంసలదీవి వేణుగోపాలశతకం
18. భర్తృహరి :7వ శతాబ్దం,సంస్కృతంలో సుభాషిత త్రిశతి శతకాన్ని వ్రాశారు. మకుటం ఉండదు. ఇందు శృంగార,నీతి, వైరాగ్య నియమాలున్నాయి
భర్తృహరి వ్రాసిన శతకాన్ని తెలుగులోకి "ముగ్గురు కవులు" వ్రాశారు. వీరు A) పుష్పగిరి తిమ్మన : సమీర కుమార శతకం, బిరుదు : కవిమిత్ర
B) ఎలకూచి బాలసరస్వతి : 16వ శతాబ్దం
మల్ల భూపాలీయ శతకం, మకుటం :సురభిమల్లా
నీతి వాచస్పతీ, రచన : రాఘవ యాదవ పాండవీయం
ఇది తొలి త్ర్యర్థి కావ్యం, బిరుదు : మహోపధ్యాయ
C) ఏనుగు లక్ష్మణకవి :18వ శతాబ్దం, సుభాషిత రత్నావళి శతకం, మకుటం ఉండదు. రచనలు : రామేశ్వర మహత్మ్యం,రామవిలాసం, విశ్వామిత్ర చరిత్ర
19.గురజాడ అప్పారావు : సత్యవతీ శతకం రచనలు : ముత్యాల సరాలు, కన్యాశుల్కం, దేశభక్తి గేయం
20. శ్రీ శ్రీ : (శ్రీ రంగం శ్రీనివాసరావు)
సిరిసిరి మువ్వ శతకం , రచనలు : అనంతం,
ప్రభవ, మహాప్రస్థానం, బిరుదులు : విప్లవకవి
అభ్యుదయ కవి, మహాకవి
21. దాశరధీ కృష్ణమాచార్యులు : దాశరథీ శతకం,
మకుటం : దాశరథీ, రచనలు : కవితాపుష్పకం,
తిమిరంతో సమరం, అగ్నిధార, రుద్రవీణ
బిరుదులు : కవిసింహ, అభ్యుదయ కవితా చక్రవర్తి
22. కరుణశ్రీ : (జంధ్యాల పాపయ్యశాస్త్రి)తెలుగు
బాల శతకం, మకుటం : లలిత సుగుణ జాల తెలుగుబాల,రచనలు : పుష్పవిలాపం, ఉదయశ్రీ, విజయశ్రీ,కరుణశ్రీ,బిరుదు :కవితాకళానిధి
23. దువ్వూరి రామిరెడ్డి : మాతృశతకం,
మిత్రార్థ శతకం, రచనలు : కృషీవలుడు,కవి - రవి, కర్షక విలాసం, బిరుదులు : కవి కోకిల, కర్షక కవి
24. సురగాలి తిమోతి జ్ఞానానంద కవి : దీనబంధు శతకం,క్రీస్తు శతకం,రచనలు : ఆమ్రపాలి,పాంచజన్యం
25. నార్ల వెంకటేశ్వరరావు : 20వ శతాబ్దం,
నార్ల వారి మాట శతకం, మకుటం : వాస్తవమ్ము
నార్ల వారి మాట, రచనలు: కొత్తగడ్డ,
నరకంలో హరిశ్చంద్రుడు
26. విశ్వనాధ సత్యనారాయణ :
శ్రీగిరి, భద్రగిరి, నందమూరు శతకాలు,
రచనలు : వేయిపడగలు, ఏకవీర, వరలక్ష్మీ త్రిశతి, అవార్డులు :జ్ఞానపీఠ, పద్మభూషణ్, కళాప్రపూర్ణ
27. నార్ల చిరంజీవి : తెలుగు పూలు శతకం,
మకుటం : తెలుగు బిడ్డ, రచనలు : ఎర్రగులాబి,
పగిలిన పచ్చి కుండలు
28. కొండూరు వీర రాఘవాచార్యులు :
20వ శతాబ్దం, మిత్ర సహస్రి శతకం,
మకుటం : విశ్వహిత చరిత్ర వినర మిత్ర
29. కూచిమంచి తిమ్మకవి : 17వ శతాబ్దం,
శ్రీభర్గ శతకం, మకుటం : భర్గా పార్వతీ వల్లభా,
కుక్కుటేశ్వర శతకం, మకుటం : భూసుత విలాస పీఠికాపుర నివాస కుముద హితకోటి సంకాశ కుక్కుటేశ్వర, రచన : నీలాసుందరీ పరిణయం
30. సత్యవోలు సుందరకవి : 20వ శతాబ్దం,
రాజశేఖర శతకం, మకుటం : శ్రీకర రాజశేఖరా
31.తరిగొండ వెంగమాంబ : 18వ శతాబ్దం,
తరిగొండ నృసింహ శతకం, మకుటం : దరిగొండ నృసింహ! దయాపయోనిధీ, రచనలు : రాజయోగామృతం, వాశిష్ట రామాయణం, అష్టాంగ యోగసారం
32.వడ్డాది సుబ్బారాయకవి : (వసురాయకవి)
20వ శతాబ్దం, భక్త చింతామణి శతకం, మకుటం : దేవా! భక్త చింతామణీ, రచనలు :వేణీసంహారం,
ప్రభోధ చంద్రోదయం, నందనందన శతకం
33. ఉత్పల సత్యనారాయణాచార్యులు :
ఉత్పలమాల శతకం
34. నృసింహకవి : కృష్ణ శతకం, 18వ శతాబ్దం,
35. కందుకూరి వీరేశలింగం పంతులు : 20వ శతాబ్దం
మార్కండేయ శతకం, రచనలు : రాజశేఖర చరిత్ర,
ఆంధ్ర కవుల చరిత్ర, బిరుదు : గద్య తిక్కన
36. గురజాడ రాఘవ శర్మ : 20వ శతాబ్దం,
వాసుదేవ శతకం,
37.నీలకంఠ దీక్షితులు : 17వ శతాబ్దం,
సభారంజన శతకం, అనువాద కవి : ఏలూరిపాటి
అనంతరామయ్య, 20వ శతాబ్దం.
38. శంకరంబాడి సుందరాచారి : శ్రీనివాస శతకం, నాస్వామి శతకం,మా తెలుగు తల్లికి మల్లె పూదండ గేయం
39.అల్లంరాజు రంగశాయి : రఘురామ శతకం,
మకుటం : రఘురామ దయాహృదయ శుభోదయ
రచన : మాధవ శతకం
40.త్రిపురనేని రామస్వామి: కుప్పుస్వామి శతకం, ధూర్తమానవా శతకం
41. బోయి భీమన్న :(1911 - 2005) పిల్లీ శతకం, రచనలు : గుడిసెలు కాలిపోతున్నాయి,జానపదుని జాబు, పాలేరు నాటకం, బిరుదులు : కళాప్రపూర్ణ, పద్మశ్రీ, పద్మభూషణ్
👌👌👏👏👏
రిప్లయితొలగించండి