* మాండలికమును బట్టి భాష 4 రకాలు
1) పూర్వ మాండలికం గల జిల్లాలు -శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
2) మధ్య మాండలికం గల జిల్లాలు - ఉభయ గోదావరి, కృష్ణ, గుంటూరు.
3) దక్షిణ మాండలికం గల జిల్లాలు - నెల్లూరు, ప్రకాశం, రాయలసీమ
4) ఉత్తర మాండలికం గల జిల్లా - తెలంగాణ
* కేంద్ర ప్రభుత్వం ప్రాచీన హోదా కల్గించిన భాషలు
1) సంస్కృతం 2) తమిళం 3)కన్నడం 4) తెలుగు
* రూపాన్ని బట్టి భాషలు 3 రకాలు 1) వాగ్రూపం
2) లిఖిత రూపం 3)సంకేత రూపం
* తెలుగు భాషలో మార్పులు 3 రకాలు
1) గ్రాంథిక భాష - చిన్నయసూరి రచనలు
2) సరళ గ్రాంథిక భాష - చిలకమర్తి, పానుగంటి,నాయని కృష్ణకుమారి రచనలు
3) వ్యవహారిక భాష - కందుకూరి, గురజాడ, గిడుగు రామ్మూర్తి రచనలు
* త్రిలింగ దేశం (తెలుగు) : శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం అనే మూడు లింగాల మధ్య గల ప్రదేశం
* అజంత భాష - అచ్చుతో పదాలు ముగియటాన్ని అజంత భాష అంటారు. తెలుగు భాష అజంత భాష
సీత - "త" లో అ అనే అక్షరం ఉంది
* ఇటలీ భాష కూడా అజంత భాషే
* విదేశీయులు తెలుగు భాషను "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని అన్నారు.
* దేశభాషలందు తెలుగు లెస్స" అని 15 వ శతాబ్దంలో శ్రీనాథుడు క్రీడాభిరామంలోనూ, 16 వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్త మాల్యదలోను అన్నారు
* భారత రాజ్యాంగం గుర్తించిన భాషలు 22
* భారతదేశంలో మొత్తం భాషలు 1652
* ప్రపంచంలో తెలుగు భాష 16 వ స్థానంలో ఉంది
* ప్రపంచంలో ఏడు వేల (7000) భాషలున్నా మాట్లాడే భాషలు 2796
* సామెతను - నానుడి,లోకోక్తి,సుద్దులు,జనశ్రుతి అంటారు. * ముందుమాటను - తొలి పలుకు, మున్నుడి, శీర్షిక అంటారు.
* జాతీయం( పలుకుబడి) - అనగా ఒక విశేష అర్థాన్నిచ్చే దానిని జాతీయమంటారు
* శబ్దపల్లవం అనగా రెండు వేరువేరు అర్థాలున్న పదాలు కలిసి మరో అర్థాన్నిచ్చే పదాన్ని శబ్దపల్లవం అంటారు. నామవాచకానికి క్రియ చేరిన పదాలను శబ్దపల్లవమంటారు.'మేలు కొను' అనేవి 2 పదాలు1 మేలు అనగా మంచి 2 కొను అనగా కొనటం ఈ 2 పదాలు కలిసి కొత్త అర్థాన్ని ఇస్తాయి. మేలుకొను అనగా నిద్ర లేపటం అనే అర్థం వచ్చింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి