నా ప్రయాణంలో ప్రకృతి సోయగం
పచ్చని పొలాల మధ్య నుంచి
రైలు ముందుకు సాగుతుంటే
ఆకాశాన్ని
తాకుతున్నట్లున్న తాటి చెట్లు
వెనుకబడి పోతు నిరాశగా
చూస్తున్నాయి
చెరువులో నీరు పాలకడలిని
తలపిస్తూ
మిలమిలా మెరుస్తున్నాయి
ఆకాశమార్గాన పక్షుల సమూహం
కిలకిలా రాగాల
నందిస్తున్నాయి
నిర్మలమైన ఆకాశాన్ని
సూర్యుడు చీల్చుకుంటూ
కాషాయపు రంగును
వెదజల్లుతూ
ప్రకృతిని లేత కిరణాలతో
స్పృశిస్తూ
ప్రకృతిని ఆనందింప జేస్తూ
తెల్లారిందంటు కోడిపుంజుకూతతో
ప్రజల నిద్రమత్తు వదిలిస్తూ
సమస్త జీవరాశులను మేలుకోలుపుతున్నాడు
సమస్త జీవరాశులను మేలుకోలుపుతున్నాడు
పెద్దవాళ్ళు చద్దిమూటతో
పనికి పోతుంటే
చిన్నారులు ఆటలకు
పరిగెడుతుంటే
తల్లి ఒడిలో చిన్నారి
పాలు తాగుతూ
తనకు తెలియని లోకంలో
విహరిస్తూ
తల్లి ఒడి వెచ్చదనంలో
నిద్రపోతున్నాడు
16 అణాల గ్రామీణ ముద్దు
గుమ్మలు
ముద్దుగా బొద్దుగా కడవలతో
ఒయ్యారపు నడకలతో
చెరువు వద్దకు చేరుకుని
చలనం లేని నీటికి కడవ
తాకిడితో
ప్రకంపనాలు కలిగించి
యువకుల గుండెల్లో గుబులు
పుట్టించారు
కిటికిలో నుండి చూస్తున్న
నేను
కళ్ళతో ప్రకృతి అందాలను
ఆస్వాదిస్తూ
హృదయంలో పదిలపరుచుకుంటూ
నా గమ్యం చేరుకున్నాను.
*************************
పువ్వు
మొక్కకు అందం
కొప్పుకు మరింత అందం
మనసు దోచే సోయగం
మత్తెక్కించే పరిమళం
సువాసనల గుబాళింపువై
ప్రేమికులకు దేవతవై
దేవుని మెడలో దండవై
అలంకరణలో రాణివై
మన్ననలు పొందిన మహారాణి వైన
ఓ పుష్ప రాజమా
నీ జీవితం క్షణ కాలం
నీ కీర్తి శాశ్వతం
మొక్కకు అందం
కొప్పుకు మరింత అందం
మనసు దోచే సోయగం
మత్తెక్కించే పరిమళం
సువాసనల గుబాళింపువై
ప్రేమికులకు దేవతవై
దేవుని మెడలో దండవై
అలంకరణలో రాణివై
మన్ననలు పొందిన మహారాణి వైన
ఓ పుష్ప రాజమా
నీ జీవితం క్షణ కాలం
నీ కీర్తి శాశ్వతం
**********************
గులాబి
నీకు నచ్చిన నేను
నీకు నచ్చిన నేను
నీకు ప్రతి రోజూ తాజాగా కనిపిస్తూ
నీకు గుడ్మార్నింగ్ చెప్పేస్తూ
నీకు నూతనోత్సాహం అందిస్తూ
నీకు ఉల్లాసాన్ని కలిగిస్తూ
నీకు బాసటగా నిలుస్తూ
నీ విజయాన్ని కాంక్షిస్తూ
నీ పూతోటలో నిలిచాను
నీ మనసు దోచిన రోజాను
*************************************
కన్ను
జన్మనిచ్చిన తల్లి నైనా
నడక నేర్పే తండ్రి నైనా
చదువు చెప్పే గురువు నైనా
సూర్యోదయానైనా
సుర్యాస్తమయానైనా
పండు వెన్నెల నైనా
కుహూ కుహూ పాడే కోయిలనైనా
పురివిప్పి నాట్యమాడే నెమళ్ళనైనా
అందమైన హరివిల్లు నైనా
దైవాన్ని దర్శించాలన్నా
ప్రకృతిలోని అందాలను చూడాలన్నా
అంతెందుకు బాబు
మనల్ని మనం అద్దంలో చూసుకోవాలన్నా
మనిషికి ప్రధాన అవయవం నయనం
అందుకే పెద్దలంటారు
సర్వేంద్రియానం నయనం ప్రధానమని
కన్నే కదాని నిర్లక్ష్యం చేస్తే
అంధులై అంధకారంలో జీవిస్తారు
అందుకే తస్మాత్ జాగ్రత్త
************************
పసిబిడ్డ ఆత్మఘోష
మాయమాటలకు లొంగిపోయావు
ప్రేమలోకంలో మునిగిపోయావు
గర్భవతిగా మిగిలిపోయావు
నమ్మకంగా గొంతు కోశాడు
అబార్షన్ కు డబ్బివ్వబోయాడు
కన్నవారి పరువు మంట కలిపావు
అర్థరాత్రి వేళ విడిచావు
ట్యాంకు బండ్ కు చేరుకున్నావు
తనువు చాలించాలనుకున్నావు
అమ్మా అన్న పిలుపు విన్నావు
నీ ప్రయత్నం ఆపుకున్నావు
ఎవరు? అని ప్రశ్నించావు?
నీ కడుపులో ఉన్న మంసపుముద్దని
నీవు చంపబోయే పసికూనని
మాతృత్వపు మాధుర్యాన్ని అందించలేవా ?
నీ ఒడిలో నిద్ర పుచ్చలేవా?
ఈ లోకాన్ని నాకు చూపించలేవా?
నీవు చేసిన తప్పుకు నా కెందుకమ్మ శిక్ష
అర్థంచేసుకో ఇది నా ఆత్మ ఘోష
***********************************
జన్మనిచ్చిన తల్లి నైనా
నడక నేర్పే తండ్రి నైనా
చదువు చెప్పే గురువు నైనా
సూర్యోదయానైనా
సుర్యాస్తమయానైనా
పండు వెన్నెల నైనా
కుహూ కుహూ పాడే కోయిలనైనా
పురివిప్పి నాట్యమాడే నెమళ్ళనైనా
అందమైన హరివిల్లు నైనా
దైవాన్ని దర్శించాలన్నా
ప్రకృతిలోని అందాలను చూడాలన్నా
అంతెందుకు బాబు
మనల్ని మనం అద్దంలో చూసుకోవాలన్నా
మనిషికి ప్రధాన అవయవం నయనం
అందుకే పెద్దలంటారు
సర్వేంద్రియానం నయనం ప్రధానమని
కన్నే కదాని నిర్లక్ష్యం చేస్తే
అంధులై అంధకారంలో జీవిస్తారు
అందుకే తస్మాత్ జాగ్రత్త
************************
పసిబిడ్డ ఆత్మఘోష
మాయమాటలకు లొంగిపోయావు
ప్రేమలోకంలో మునిగిపోయావు
గర్భవతిగా మిగిలిపోయావు
నమ్మకంగా గొంతు కోశాడు
అబార్షన్ కు డబ్బివ్వబోయాడు
కన్నవారి పరువు మంట కలిపావు
అర్థరాత్రి వేళ విడిచావు
ట్యాంకు బండ్ కు చేరుకున్నావు
తనువు చాలించాలనుకున్నావు
అమ్మా అన్న పిలుపు విన్నావు
నీ ప్రయత్నం ఆపుకున్నావు
ఎవరు? అని ప్రశ్నించావు?
నీ కడుపులో ఉన్న మంసపుముద్దని
నీవు చంపబోయే పసికూనని
మాతృత్వపు మాధుర్యాన్ని అందించలేవా ?
నీ ఒడిలో నిద్ర పుచ్చలేవా?
ఈ లోకాన్ని నాకు చూపించలేవా?
నీవు చేసిన తప్పుకు నా కెందుకమ్మ శిక్ష
అర్థంచేసుకో ఇది నా ఆత్మ ఘోష
***********************************
చీర
16 అణాల తెలుగుదనాన్ని
6 గజాల్లో దాచుకొని
హరివిల్లులోని రంగుల్ని
తనలో నింపుకొని
భారతీయ సంప్రదాయానికి దర్పణమై
వస్త్ర ప్రపంచంలో రాణియై
ప్రపంచ దేశాలకు ఆదర్శమై
విదేశీ వనితలకు చేరువై
భారతదేశ ఔన్నత్యాన్ని చాటి
అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించింది
రెండక్షరాల చీర ....
నేడు భారతీయ వనితలు
ముందొచ్చిన చెవులకంటె ... అన్న సామెతలా
చీరపై సవతి తల్లి ప్రేమ చూపిస్తూ
విదేశీ సంప్రదాయాన్ని ఆచరిస్తూ
ఛీ అంటూ చీరను ప్రక్కన పెడుతున్నారు
తల్లి పొత్తిళ్ళలోని బిడ్డలా
స్త్రీ తనువుపై ఒదగాలి చీర
మగువలు చీరకు ఇవ్వాలి ప్రాముఖ్యం
నిలపాలి మన దేశ ఔన్నత్యం
********************************
తాళి
తాళి
పంచభూతాల సాక్షిగా
అగ్నిదేవుని సన్నిధిలో
వేద మంత్రాల ఉచ్చరణతో
మూడుముళ్ళ బంధంతో
స్త్రీ మెడలో చేరి
కుమారిని ఇల్లాలిగా మార్చి
పాతివ్రత్యాన్ని, పవిత్రతను చేకూర్చి
ఐదవతనాన్ని ఇస్తుంది తాళి
నేడు తాళిని ఎగతాళి చేస్తూ
అలంకార వస్తువుగా భావిస్తూ
గోడకు వ్రేలాడదీస్తూ
హైందవ సంస్కృతిని హేళన చేస్తూ
లేని వైధవ్యాన్ని కోరుకుంటున్నారు
కొందరు ఆధునిక మహిళామతల్లులు.
*****************************
వినండి ఆలోచించండి
ఆడపిల్లల్ని కన్న తల్లులారా
మాన ప్రాణాలకు రక్షణ ఇవ్వక
సినిమా స్టార్లతో పోలుస్తూ
ఫ్యాషన్ డ్రస్సులో తిప్పేస్తూ
ఆడపిల్లల్ని ఆట బొమ్మల్లా
ఆడతనం అంగట్లో సరుకుల్లా
కామాంధులకు విందు భోజనంలా
సమాజం చిన్నచూపు చూసేలా పెంచక
కళ్ళు తెరవండి నిజం గ్రహించండి
ఫ్యాషన్ మహమ్మారిని తరిమి కొట్టండి
మన ఆచార సాంప్రదాయాలతో పెంచండి
తల్లులారా తలెత్తుకు జీవించండి
భారత దేశ ఔన్నత్యాన్నికాపాడండి
***************************
మృగ్యమౌతున్న సంస్కృతి
16 అణాల మన తెలుగింటి పిల్ల
సంస్కృతి సాంప్రదాయాలకు విలువనిచ్చె ఆడపిల్ల
నాడు ఇంట్లో వున్న శ్రీమహాలక్ష్మి
నేడు నేల విడిచి సాము చేసింది
పాశ్చాత్య మోజులో మునిగిపోయింది
అందాల పోటీల్లో పాల్గొంటూ
ఆచార సాంప్రదాయాలను మంట కలిపింది
రంగుల కలల్లో విహరిస్తూ
ధనార్జనకే విలువనిచ్చింది
ఫ్యాషన్ మత్తులో జీవిస్తూ
వలువల్ని చిన్నవి చేసింది
కట్టు బొట్టుప్రక్కన బెట్టి
క్యాట్ వాక్ ప్రదర్శనలిచ్చింది
నాగరికత వెర్రి తల లేసింది
వ్యవస్థనే నిర్వీర్యం చేసింది
***************************
ఆడపిల్ల
మద్యం మత్తులో బాల్యాన్ని
సారాకొట్లో తనఖా పెట్టిరి
కడుపునిండేదారి లేక
కూతుళ్ళను పని మనుష్యులుగా మార్చిరి
కాసు కోసం కన్యను
తాతలకిచ్చి పెళ్ళి చేసిరి
యవ్వనం పిల్ల పాలిట శాపమై
దొరల పానుపైనలిగి పోయింది
ఆడతనం అంగడి సరుకై
అరబ్బుల డాలర్లకు అమ్ముడుపోయింది
నాయకుల రాజకీయ చదరంగంలో
ఆడపిల్లల శీలం ఆహారమయ్యింది
పెద్దల అంగీకార సాగరంలో
శారదా చట్టం కొట్టుకు పోయింది
బాల్య వివాహాల కొలిమిలో
పసితనం కాలి బూడిదయ్యింది
మూడాచారాల మేలిముసుగులో
బాలికల చదువు మంటకలిసింది
కరెన్సీ నీడలో ప్రభుత్వముంటే
చట్టాలకు సూర్యోదయం ఎక్కడ?
ప్రజల్లో చైతన్యం రాకుంటే
ఆడపిల్లల జీవితాలలో స్వేచ్చ ఎక్కడ?
నిత్యం వ్యాపార వస్తువే ఆడపిల్ల
***********************
నాడు - నేడు ఆడపిల్ల
పేదరికపు విషవలయంలో జన్మించి
నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు
కన్యాశుల్కమనే పేరాశతో
బాల్య వివాహాలను ప్రోత్సహించి
ఆడపిల్లల్ని అంగడి బొమ్మల్లా
మనసులేని జీవఛ్ఛవాలుగా మార్చి
కాటికి కాలు చాపిన తాతలతో
పెళ్ళనే అగ్నిగుండంలోకి నెట్టి వేసిరి
ఊహకందని భార్య పాత్రను భారంగా మోస్తూ
ముదుసలి మొగుడితో కాపురం చేస్తూ
బిక్కుబిక్కుమంటు కాలం గడిపేస్తూ
అస్తమించిన భర్త శవంపై పడి
మోడువారిన బాల్యాన్ని తల్చుకుంటు
వెక్కివెక్కిఏడుస్తూ వుంటే
చేయూత నివ్వని సమాజంలో
జాలి, కరుణ లేని మనుష్యులంత
తెలియని వైధవ్యాన్ని అంటగట్టి
వంటింటి కుందేళ్ళుగా మార్చి వేసిరి
పుణ్యం వస్తుందని నమ్మబలికి
సతీసహగమనం పేరుతో నిప్పంటించిరి
నేడు అక్షరాస్యత పెరిగినా
అన్ని రంగాలలో ముందున్నా
ఆడపిల్ల ఆడపిల్లే అంటోంది సమాజం
వరకట్నం నల్లత్రాచులా బుసలు కొడుతుంటే
ఆడపిల్లల ఆర్తనాదాలు ఆకాశాన్ని తాకుతున్నాయి
పుట్టింది మొదలు గిట్టేవరకు
భయం గుప్పిట్లో గడుపుతోంది
తన జీవితం చిరిగిన విస్తరి కాకూడదని
సమాజంలో మార్పు రావాలని
మరో సంఘ సంస్కర్త జన్మించాలని కోరుకుంటుంది.
************************
మాయదారి ఎయిడ్స్ రోగం
బాల్యాన్ని మొగ్గలో తుంచేస్తుంది
తల్లిదండ్రుల్లేని
అనాధలను చేస్తుంది
అక్కున జేర్చుకునే
వారులేక
కూడు గూడు గుడ్డకు
నోచుకోక
జాలి లేని సమాజమందు
చేయూత నివ్వని మనుషుల
మధ్య
అంటరాని వారిలా అందరికి
దూరంగా
వీధి బాలల్లా
బిచ్చమెత్తుకుంటూ
మిణుకు మిణుకు మంటున్న
ఆరోగ్యానికి
దవాఖానాలోని మందులు సైతం
అందని ద్రాక్షల్లా ఊరిస్తూ
వారి పాలిట శాపంగా మారాయి
ఆదరణ కోసం ఎదురుచూస్తూ
భారంగా బ్రతుకు
నీడుస్తున్నారు
మన ఎయిడ్స్ బాధిత
చిన్నారులు
*******************
స్వైన్ ఫ్లూ
వరాహ మందు పుట్టింది
వానపాములా పెరిగింది
అనకొండలా దేశాలను
కబళిస్తోంది
చాప కింద నీరులా భారతదేశం
వచ్చింది
మహాప్రళయంగా విరుచుకు పడుతోంది
పేరు చెబితే చాలు ఉలికి
పడుతున్నారు
భయం గుప్పెట్లో జనం
బ్రతుకుతున్నారు
వ్యాధికి దవాఖానాలో
మందులు శూన్యం
అదే స్వైన్ ఫ్లూ
మొన్న ఆంత్రాక్స్, నిన్న ఎయిడ్స్
నేడు స్వైన్ ఫ్లూ, రేపు ప్రశ్నార్ధకం
లేదా ఈ రోగాలకు అంతం
నిత్యం చస్తూ బ్రతకటమేనా
జీవితం
రాదా మానవాళికి సంపూర్ణ
ఆరోగ్యం
**********************
ఉగ్రవాదం
మనసులో కాఠిన్యం
ఆలోచనలో ఆవేశం
ఆచరణలో ఉన్మాదం
మాటల్లో కరుకుతనం
చూపుల్లో క్రూరత్వం
నడకలో భయానకం
చేతల్లో బీభత్సం
కలగలిపిందే ఉగ్రవాదం
*******************
యుద్ధం
యుద్ధం యుద్ధం యుద్ధం
ఇది ఊహకే భయానకం
ఇది మానవాళికి వినాశనం
ధన మాన ప్రాణాలకే ముప్పు
కూడు గూడు గుడ్డ కరువు
అంటురోగాలు ప్రబలు
ఆర్ధిక సంక్షోభం పెరుగు
ఆకాశ హర్మ్యాలు కూలు
ఆకాశంలో రణ ఘోష
ధరిత్రి గుండెల్లో తీరని
వ్యధ
************************
సైకో
అందరిలో శ్రీరాముడు
సప్త వ్యసనాల దాసుడు
ఇంట్లో రావణుడు
మాటల్లో కాటిన్యం
చూపుల్లో వికృతం
చేతల్లో శాడిజం
నడకలో క్రూరత్వం
ఆలోచనలో రాక్షసత్వం
మనసంతా పైశాచికం
తనువంతా అనుమానం
పెడ్తాడు శారీరక
చిత్రహింసలు
చేస్తాడు మానసిక
వ్యభిచారం
డాక్టర్లకే అర్థం కాని
రోగి
అతడే అంతు చిక్కని ఉన్మాది
**********************
మానవ మృగాలు
భవిష్యత్తును పూల పాన్పుగా
చదువే తన సర్వస్వంగా
ఇంజనీరింగే తన కలలా
ఊహల్లో జీవిస్తున్న
అమ్మాయిని
వాస్తవం వెక్కిరించింది
అందం ఆమె పాలిట శాపమై
ప్రేమోన్మాదం ఆమె
నాశనానికి పునాదై
పులికి చిక్కిన జింకలా
మానవమృగాల కబంధ హస్తాలలో
ప్రేమ కరాళనృత్యం చేసింది
తనువు రాబందులకు
ఆహారమయింది
చెవిటివాడి ముందు శంఖం
మోతలా
మానవత్వం లేని ప్రేమోన్మాదుల
మధ్య
మనసు విలవిలలాడి పోయింది
శరీరం యాసిడుకు తలవంచింది
అబల విలపించిన ఆర్తనాదాలు
అరణ్యరోదనలా శూన్యంలో కలిసి పోయాయి
***************************
అనుమానం
అమాయకంగా కనిపిస్తూ
అనురాగాన్ని నటిస్తూ
అభిమానాన్ని దెబ్బతీస్తూ
ఆనందాన్నికాలరాస్తూ
అనుబంధాన్ని చెరిపేస్తూ
ఆలనాపాలనా మరచి
అపార్దాలతో కాపురం చేస్తూ
అలకలతో
చిర్రుబుర్రులాడుతూ
అన్యోన్యతకు విలువనివ్వక
అమానుషంగా ప్రవర్తిసూ
మన: శాంతిని దూరం చేస్తూ
మాటలతో కించపరుస్తూ
సర్వానర్దాలకు మూలంగా
నిలిచి
మనసును హత్యచేసి
మమకారానికి చితిపేర్చి
మంచితనానికి నిప్పుపెట్టి
మానవత్వాన్ని తగులబెట్టి
కుటుంబాన్ని నాశనం
చేస్తుంది
అనుమానమనే పెనుభూతం
************************
అసూయ - ద్వేషం
మనిషిలోని అసూయ ద్వేషాలు
అందమైన అక్కాచెల్లెళ్ళు
మేలి జలతారు ముసుగులో
ఎదుటివారిని నమ్మిస్తూ
సాయపడక
సాయం పొందక
తడిగుడ్డతో గొంతుకోస్తూ
తానెదగక
ఎదిగే వారిని చూసి ఓర్వలేక
చాప క్రింద నీరులా
ఎదుటి వారికి గోతులు త్రవ్వుతూ
నమ్మిన వారికి కునుకు లేకుండా చేస్తూ
తాను ఆనందంగా గడిపేస్తూ
అయిన వారిని చిత్రవథకు గురిచేస్తూ
తాపట్టిన కుందేటికి మూడేకాళ్ళంటూ
కాలం వెళ్ళబుచ్చుతూ
ఇరువురి పతనానికి మూల మౌతాయి
******************
జీవన ప్రయాణం
మనిషి జీవన ప్రయాణంలో
ఆటు పోట్లు ఎన్నో
కలతలు కన్నీళ్ళేన్నో
ఈసడింపులు అవమానాలెన్నెన్నో
అనుమానాలు అపార్దాలెన్నో
ఆనంద డోలికలెన్నో
విషాద ఛాయలెన్నెన్నో
తీపి గుర్తు లింకెన్నో
చేదు జ్ఞాపకాలెన్నో
ఆర్ధిక సంక్షోభాలెన్నో
మనసునొచ్చుకున్న మాటలెన్నెన్నో
సంఘర్షణలతో, మజిలీలతో
జీవన్మరణాల చీకటిలో
దారి చూపే మిణుగురుకై
ఆశగా ఎదురుచూస్తూ
అడుగు ముందుకేస్తూ
***********************
మరణం
మరణం
జీవన్మరణాల మధ్యకాలంలో
ఆసరాగా నిలిచిన మనిషి
ఎన్నో ఆశలతో, ఆశయాలతో
ఎన్నెన్నో ఊసులతో, ఊహాలతో
మరెన్నోకలలతో, ఆలోచనలతో
సాగిస్తున్న జీవన ప్రయాణాన్ని
మృత్యువు నల్లతాచులా వెన్నాడి
జీవితాన్ని అర్ధాంతరంగా కాటువేస్తే
కన్నవారికి కడుపుకోతను
ఆలుబిడ్డలకు గుండె కోతను మిగిల్చి
ఇల్లాలి నుదుట బొట్టును తుడిచి
వైధవ్యాన్ని అంటగట్టి
కుటుంబాన్ని చీకట్లోకి నెట్టి
జీవితాలను ఛిద్రంగా మారుస్తూ
తన ఉనికిని తెలియజేస్తూ
అందరి వెన్నులో వణుకుపుట్టిస్తూ
తనువుకు చెమటలు పట్టిస్తూ
జీవితం క్షణకాలమంటూ
శ్మశాన వైరాగ్యాన్ని గుర్తు
చేసేదే మరణమనే మృత్యుఘోష.
************************
అవినీతి
మనిషి రక్తంలో నేనున్నాను
చాపకింద్ర నీరులా మారాను
అన్ని రంగాలలో కలసి పోయాను
అందర్నినా చుట్టు తిప్పుకున్నాను
కేన్సర్ గా వచ్చాను
వ్యవస్థనే నిర్వీర్యం చేశాను
అధికారులకే వరమయ్యాను
అదృష్టలక్ష్మీగా తలుపు తడతాను
ఏ.సి.బి. వాళ్ళతో పట్టిస్తాను
అసలుకే ఎసరు పెడతాను
పరువు మంట కలుపుతాను
నన్ను నమ్ముకొని మోసపోయిన
మీ అవినీతి హస్తాన్ని నేను
*************************
పౌరుడా మేలుకో
ఆధునిక సమాజంలో
నీతిని తుంగలో తొక్కి
అవినీతికి పట్టం కట్టి
ధర్మాన్ని బంధించి
అధర్మానికి స్వేచ్చనిచ్చి
న్యాయాన్ని చీకట్లోకి నెట్టి
అన్యాయానికి వెలుగుపంచి
కుల, మత, ప్రాంతీయ విభేదాలు సృష్టించి
అన్ని రంగాలలో ఎదుగుతూ
అన్నమో రామచంద్ర అన్న
అభాగ్యుల నోళ్ళు కొట్టి
శ్రామికుల శ్రమను దోచి
డబ్బుల్ని మూటలు కట్టి
వారసులకు కట్టబెట్టి
అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు
తల్లిపాలు తాగి, గుండెల్లో తన్నినట్లుగా
భారతదేశంలో పుట్టి
కుంభకోణాలు సృష్టించి
దేశ సంపద కొల్లగొట్టి
డాలర్లుగా మార్చి, బ్యాంకుల్లో దాచి
దేశానికి దారిద్ర్యాన్ని కట్టబెట్టి
దేశాన్ని అప్పులపాలు చేస్తున్నారు
మానవత్వం లేని అవినీతిపరులు
ప్రజలారా కళ్ళు తెరవండి
నిద్రమత్తు వీడండి
సమాజాన్ని మేల్కొలపండి
స్వార్థపరులపై ధ్వజమెత్తండి
దేశాభివృద్ధికి పాటుపడండి
దేశాన్ని తలెత్తుకునేలా చేయండి.
******************************
డబ్బు
తల్లి పేగు బంధమైనా, తండ్రి ప్రేమైన,
భర్త అనురాగమైనా, స్నేహ బంధుత్వమైనా
డబ్బుతో ముడి పెడుతూ
డబ్బుకు లోకం దాసోహమంటూ
డబ్చిస్తే అందలం లేకుంటే పాతాళమన్నట్లు
పొగడటం లేకుంటే శాపనార్దాలన్నట్లు
నరంలేని నాలుకతో నాట్యం చేయిస్తూ
చాటుమాటుగా నవ్వుకుంటూ,
గుసగుసలాడుకుంటూ
హేళనచేస్తూ, పైశాచిక ఆనందాన్ననుభవిస్తూ
దినం గడిస్తే చాలనుకుంటూ
భవిష్యత్తును మర్చిపోతూ
మాటల తూటాలతో మనసును గాయం చేస్తున్నారు
గాయపడ్డ మనసు తనువు చాలిస్తే
అన్నవారు ఏడ్చినంత మాత్రాన
మనసుకు తగిలిన గాయం మానుతుందా?
తనువులో కదలిక వస్తుందా?
మనిషి సృష్టించిన డబ్చే
మనిషిని చెప్పు చేతల్లో పెట్టుకొని ఆటాడిస్తోంది
***************************
డబ్బు
తల్లి పేగు బంధమైనా, తండ్రి ప్రేమైన,
భర్త అనురాగమైనా, స్నేహ బంధుత్వమైనా
డబ్బుతో ముడి పెడుతూ
డబ్బుకు లోకం దాసోహమంటూ
డబ్చిస్తే అందలం లేకుంటే పాతాళమన్నట్లు
పొగడటం లేకుంటే శాపనార్దాలన్నట్లు
నరంలేని నాలుకతో నాట్యం చేయిస్తూ
చాటుమాటుగా నవ్వుకుంటూ,
గుసగుసలాడుకుంటూ
హేళనచేస్తూ, పైశాచిక ఆనందాన్ననుభవిస్తూ
దినం గడిస్తే చాలనుకుంటూ
భవిష్యత్తును మర్చిపోతూ
మాటల తూటాలతో మనసును గాయం చేస్తున్నారు
గాయపడ్డ మనసు తనువు చాలిస్తే
అన్నవారు ఏడ్చినంత మాత్రాన
మనసుకు తగిలిన గాయం మానుతుందా?
తనువులో కదలిక వస్తుందా?
మనిషి సృష్టించిన డబ్చే
మనిషిని చెప్పు చేతల్లో పెట్టుకొని ఆటాడిస్తోంది
***************************
విశ్రాంతీ నీ వెక్కడ ?
వారమంతా పడిన శ్రమకు
ఆదివారం నాడు విశ్రాంతి వుంది
ఆదివారం కూడా శ్రమ పడితే
విశ్రాంతి దొరికేదెక్కడ?
మనిషికి విశ్రాంతి ఆవిరైతే
ఉత్సాహం నిరుత్సాహంగా మారి
పని చెయ్యాలనే తపన పోయి
జీవితంపై విరక్తి కలిగి
మనిషి మర మనిషిగా మారి
యాంత్రికంగా పనిచేస్తూ
బాధ్యతల్ని భారంగా నెరవేరుస్తూ
విశ్రాంతి రోజు కోసం ఎదురు చూస్తుంటాడు.
****************************
ప్రకాశం బ్యారేజ్
రెండు జిల్లాల వారధి
మన ప్రకాశం బ్యారేజ్
గత చరిత్రకు ఆలవాలము
నేడు ప్రమాదాలకు నిలయము
నాడు పర్యాటక ప్రదేశము
నేడు చూచుటకు అధ్వాన్నము
వారధికి పడ్డవి గోతులు
అధికారుల నిర్లక్ష్యానికి ప్రతీకలు
నేడు వారధికి పట్టింది అధోగతి
రేపు కనిపిస్తుంది చరిత్రలో ఇది
అదే మనందరికి ఒక గుణపాఠం
*************************
నాడు - నేడు సీతాకోకచిలుక
నాడు నేను నల్లగాను, కురూపిగాను
ఒళ్ళంతా నూగుతో ఉన్నానని
పిల్లలు భయపడుతుంటే
పెద్దలు నిర్ధయగా చంపేవారు
నేను పడిన చోట దద్దుర్లోస్తాయని
నన్నందరూ ఛీదరించుకున్నారు
నేడు హరివిల్లులోని రంగుల్ని
నాలో పదిలపరుచుకుని
పూలలోని మకరందాన్ని సేవిస్తూ
నింగిలో ఒయ్యారంగా విహరిస్తూ
అందచందాలను ప్రదర్శిస్తుంటే
పెద్దలు చూసి ఆనందిస్తుంటే
ప్రేమికులు ఊహల్లో తేలిపోతుంటే
పిల్లలు నన్నందుకోవాలని చూస్తుంటే
చిన్నారుల్ని కవ్విసూ ఆటాడిస్తూ
ప్రకృతి ఒడిలో ఓలలాడిస్తూ
నన్ను నేను మైమరచిపోతున్నాను
నాడు గొంగళి పురుగుగా దూరమై
నేడు సీతాకోకచిలుకగా చేరువై
అందరి మదిలో స్థానం పొందాను
***********************************కలిసుంటే కలదు సుఖం
స్వార్థపూరిత సమాజంలో
నిస్వార్థ వ్యక్తులు చాలా అరుదు
నోరు మంచిదైతే ఊరుమంచిదంట
ఒంటికాయ సొంఠి కొమ్ములా ఉండకోయి
తల్లో నాలుకలా ఉండవోయి
నన్నంటు కోకు నామాల కాకిలా కాక
పొరుగు వ్యక్తికి సాయపడవోయి
చిరునవ్వుతో కలుగుతుంది పరిచయం
పరిచయంతో దగ్గరౌతారు పొరుగువారు
సుఖ దు:ఖాలలో తోడుంటారు నీ పొరుగువారు
*******************************
రావాలి మనలో చైతన్యం
దారిద్ర్యమే బలహీనులకు శాపం
నిరక్షరాస్యులైనమ్ముతున్నారు స్వాముల గారడీలు
అజ్ఞానంతో మొక్కుతున్నారు బాబాలను
బాణామతి ఉచ్చులో చిక్కుతున్నారు పేదలు
చేతబడి పేరుతో పెడుతున్నారు చిత్రహింసలు
బాణామతిని పెంచి పోషిస్తున్నారు స్వార్థపరులు
మానవత్వం వీడి కత్తిరిస్తున్నారు నాలుకలు
ఇకనైనా కళ్ళుతెరవాలి భారత ప్రభుత్వం
అమలు చేయాలి పటిష్టమైన చట్టం
పార్యాంశాల ద్వారా వివరించాలి సాంఘిక దురాచారాలను
రాబోవు తరాల కందించాలి ఉజ్వల భవిష్యత్తును
*********************************
జంతు బలి
మనమున్నది కంప్యూటర్ యుగంలో
వదిలిపోలేదు సాంఘిక దురాచారాలు
మూఢనమ్మకాల ఊబిలో బలైపోతున్నాయి మూగజీవులు
సంబరాలలో రాలుతున్నాయి తలలు
దేవుని పేరుతో ఏరులైంది రుధిరం
ఎన్నాళ్ళీ బలిదానం
మూగజీవుల ప్రాణత్యాగం
రావాలి మనలో చైతన్యం
అమలు చేయాలి వన్యప్రాణుల చట్టం
లేకుంటే అంతరించి పోతుంది మన జంతు ప్రపంచం
****************************
జాలిలేని వరుణుడు
ఆకాశంలో ఋతువులు దోబూచులాడాయి
కనుచూపుమేర మబ్బులు రాకున్నాయి
ధరిత్రిపై వానలు పడకున్నాయి
వర్షాలులేక ఆకుమళ్ళు ఎండిపోయాయి
వాగుల్లో నీళ్ళన్నీ యింకిపోయాయి
దాహంతో గొంతు లెండిపోయాయి
ఎదురు చూపుల్లో కాలం కరిగిపోయింది
కంటిలోన తడి ఆరి పోయింది
వరుణుడికి జాలి కలుగలేదు
వాన జాడ గూర్చి చెప్పలేదు
రైతుల్లో ఆశ తీరలేదు
ఆశ నిరాశల మధ్య రైతు వుండి పోయాడు
****************************
కరుణించు కురిపించు
భూమాత తాపాన్ని చల్లారు
రైతు కళ్ళలో ఆశను కల్గించు
మోడువారిన పైరుకు చిరుజల్లులు కురిపించు
పాడి పంటలను చల్లగా రక్షించు
ఎండుతున్న చెట్ల ప్రాణాన్నికాపాడు
పిల్లల హృదయాలలో ఆనందం నింపు
అందరి జీవితాల్లో వెలుగు పంచు
దేశ ప్రగతికి చేయూత నివ్వు
నీరాక కోసమే ఈ హెూమాలన్నీ
రారా దివి నుండి భువికి దిగిరారా
వాన రారా స్వామి రారా
**************************
ప్రకృతి
ఎత్తైన కొండలతో
పారే సెలయేళ్ళతో
పచ్చిక మైదానాలతో
ఝుమ్మని సాగే తుమ్మెదలతో
నాట్యమాడే నెమళ్ళతో
పరిమళాలు పంచే పూలతో
అందమైన గులాబీలతో
సంగీత సాధనాల పుట్టిల్లుగా
ఆరోగ్య ప్రదాయినిగా
ఆకలి తీర్చే అమ్మగా
నాడు పూజలందుకున్న దేవతవు
నేడు స్మగ్లర్ల, నక్సలైట్ల చేతిలో కీలు బొమ్మవు
ఓ ప్రకృతీ రేపే మౌతుందో నీ స్థితి
***************************
ప్రేమ వంచన
యుక్తవయసులో ఆడపిల్లలు
ఆశల వ్యామోహంలో పడి
చెలికాడి ప్రేమలేఖలకు లొంగి
చదువు వదిలి భవిష్యత్తు మరచి
పరువు మర్యాదలకు తిలోదకాలిస్తూ
తల్లిదండ్రుల్ని వంచన చేస్తూ
ప్రేమికుడ్ని సర్వస్వంగా భావిస్తూ
ఊహల్లో తేలిపోతూ
ప్రేమ పావురాల్లా ఎగిరిపోతూ
ప్రేమలోకంలో గడుపుతూ
ప్రేమ సాగరంలో ఓలలాడుతూ
ప్రేమ ఖైదీగా మారుతూ
అల్లరి ప్రియుడికి తనువును అర్పిస్తే
ముద్దులప్రియుడు ముద్దుగా గర్భవతిని చేసి
అవసరం తీరిన తర్వాత...... అన్న సామెతలా
అబార్షన్ కు డబ్బలిచ్చి నిర్ధయగా వదిలేస్తే
తల్లిదండ్రులకు ముఖం చూపలేకకొందరు
ఆత్మహత్యలు చేసుకుంటుంటే
న్యాయం జరగాలంటూ
పెద్దలనాశ్రయించే వారింకొందరు
విధికి తలవంచిన ప్రియుడు
ప్రియురాలిని ఆలిగా అంగీకరించినా
కొత్తకు వింత....... అన్న సుద్దుల్లా
ఆలిని గాలికొదిలేసి
ప్రేమకు సమాధి కట్టి
మరో చక్కని చుక్కకై
ముస్తాబై ఎదురు చూస్తాడు
తెల్లనివన్నీ పాలు కావు
కుర్రాళ్ళంతా బుద్ధిమంతులుకారు
ఆశలకు లొంగబోకు
జీవితాన్ని ఛిద్రం చేసుకోకు
తస్మాత్ జాగ్రత్త ఓ ఆడపిల్లా
ప్రేమ వంచన
యుక్తవయసులో ఆడపిల్లలు
ఆశల వ్యామోహంలో పడి
చెలికాడి ప్రేమలేఖలకు లొంగి
చదువు వదిలి భవిష్యత్తు మరచి
పరువు మర్యాదలకు తిలోదకాలిస్తూ
తల్లిదండ్రుల్ని వంచన చేస్తూ
ప్రేమికుడ్ని సర్వస్వంగా భావిస్తూ
ఊహల్లో తేలిపోతూ
ప్రేమ పావురాల్లా ఎగిరిపోతూ
ప్రేమలోకంలో గడుపుతూ
ప్రేమ సాగరంలో ఓలలాడుతూ
ప్రేమ ఖైదీగా మారుతూ
అల్లరి ప్రియుడికి తనువును అర్పిస్తే
ముద్దులప్రియుడు ముద్దుగా గర్భవతిని చేసి
అవసరం తీరిన తర్వాత...... అన్న సామెతలా
అబార్షన్ కు డబ్బలిచ్చి నిర్ధయగా వదిలేస్తే
తల్లిదండ్రులకు ముఖం చూపలేకకొందరు
ఆత్మహత్యలు చేసుకుంటుంటే
న్యాయం జరగాలంటూ
పెద్దలనాశ్రయించే వారింకొందరు
విధికి తలవంచిన ప్రియుడు
ప్రియురాలిని ఆలిగా అంగీకరించినా
కొత్తకు వింత....... అన్న సుద్దుల్లా
ఆలిని గాలికొదిలేసి
ప్రేమకు సమాధి కట్టి
మరో చక్కని చుక్కకై
ముస్తాబై ఎదురు చూస్తాడు
తెల్లనివన్నీ పాలు కావు
కుర్రాళ్ళంతా బుద్ధిమంతులుకారు
ఆశలకు లొంగబోకు
జీవితాన్ని ఛిద్రం చేసుకోకు
తస్మాత్ జాగ్రత్త ఓ ఆడపిల్లా
మంట
శ్రీరాముడుండేది భద్రాచలమంట
శ్రీలు పొంగిన జీవగడ్డ మనదేశమంట
శీతాకాలంలో చలిమంట
సంక్రాంతి లో భోగి మంట
అన్నార్తులకు ఆకలి మంట
అసూయా పరులకు కడుపుమంట
అతివృష్టి అనావృష్టివల్ల క్షామమంట
ఎదకు గాయమైతే దుఃఖమంట
అతి ప్రమాదమంట
మితం ఆరోగ్య మంట
మితం ఆరోగ్య మంట
మంచితనమే అందరికి క్షేమమంట
*****************************
వెన్నెల
అంధ తామసమును చీల్చి- చంద్రార్ధముగా ఉద్భవించి
దినదినాభివృద్ధి అగుచు - తారలతో జతకూడి
దివికి ,భువికి రేఎండనందించి
కలువల్ని అంశువులతో ముద్దాడి
కౌముదిలో ఓలలాడించాడు సోముడు
చంద్రికలో ప్రేమికులు విహరించి
ప్రేమగీతాలు పాడుకుంటారు
వెన్నెల జలపాతంలో పిల్లలు
ఆటపాటలతో తడిసి ముద్దౌతారు
రజనీకరుడ్ని ఆహ్వానిస్తూ
తల్లి బిడ్డకు గోరుముద్ద లందిస్తుంది
నిండు జాబిల్లిలో అవ్వ
బుడతలకు నీతి కథలు చెబుతుంది
తెమ్మెరలను ఆస్వాదిస్తూ
అమ్మపాడే జోలపాట వింటూ
జనని ఎదపై నిద్రిస్తాడు చిన్నారి
పున్నమి వెలుగుల్లో పెద్దలంతా
ఆరుబయట చేరి సాపాటు చేస్తారు
ఆబాల గోపాలానికి మామై, చందమామై
అందరి మనస్సుల్లో నిలిచాడు శశాంకుడు
*********************************
ప్రేమికులు
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి
ఎక్కడెక్కడో చదువుకుంటూ
చూపులు కలిసాయంటూ
మనసులిచ్చిపుచ్చుకుంటూ
ప్రేమలేఖలు ఇచ్చుకుంటూ
ప్రేమికుల మయ్యామంటూ
ప్రాశ్చాత్య సంస్కృతి ననుసరిస్తూ
ఊహల్లో జీవిస్తూ -క్లబ్బులకు పబ్బులకు
హోటళ్ళకు, రెస్టారెంట్లకు
సినిమాలకు, పార్కులకు
ప్రేమ పావురాల్లా విహరిస్తూ
ప్రేమికుల రోజును జరుపుకుంటూ
తల్లిదండ్రుల నమ్మకాన్ని ఒమ్ముచేస్తూ
ఇంటి పరువును బజారుకీడుస్తూ
భవిష్యత్తును ఛిద్రం చేసుకుంటూ
ప్రేమ సాగరంలో విహరిస్తున్నారు
నేటి యువతీ యువకులు
*********************************
మేకవన్నె పులులు
బాల్య మాధుర్యం గ్రోలే బుడతల్ని
కళ్ళల్లో అమాయకత్వం నిండిన కూనల్ని
మోములో చిరునవ్వుల్నిగల్గిన మొగ్గల్ని
ఎదనిండా సద్భావన నింపుకున్నపిల్లల్ని
ప్రేమకు లొంగే చిన్నారుల్ని
లోకం తెలియని పాపల్ని
ముక్కుపచ్చ లారకుండానే
మానవత్వం మర్చిపోయి
విచక్షణాజ్ఞానాన్ని కోల్పోయి
మదమెక్కిన కామాంధులు
వయసును వావివరసలను మర్చిపోయి
మాన ప్రాణాలు హరిస్తూ
జీవితాన్ని ఛిద్రం చేసేస్తూ
భవిష్యత్తును శూన్యంలోకి నెట్టేస్తూ
శ్రీరాముడిలా నటిస్తూ
సభ్యసమాజాన్ని మోసంచేసే కీచక కామాంధుల్ని
సభ్యసమాజంలో నిలబెట్టి
వీక్షకుల గుండెల్లో గుబులు పుట్టేట్లు
వెన్నులో ఒణుకు పుట్టేట్లు
కళ్ళముందు ఆ దృశ్యమే కనపడేటట్లు
మరో కామాంధుడు ఉద్భవించటానికి భయపడేట్లు
శిక్షలు కఠినంగా విధించినప్పుడే
ఆడపిల్ల స్వేచ్చగా జీవించ గలదు
ఆడపిల్ల స్వేచ్చగా జీవించ గలదు
*******************************
ఎవరిని నమ్మాలి
అనుమానం పెనుభూతమై
వరకట్నం నల్లత్రాచై
కట్టుకున్నవాడ్ని కసాయిగా మార్చి
ఆలుబిడ్డల్ని కడతేరుస్తున్నాయి
ఆస్తిపాసులకై అయినవారే నరహంతకులై
కుటుంబ సభ్యులను హతమారుస్తున్నారు
మదమెక్కిన కామాంధులు
వావివరుసలు మర్చిపోయి
ఆడపిల్లల్ని అల్లరి పెడుతూ
మాన ప్రాణాలు హరిస్తున్నారు
నమ్మినవారే వెన్నుపోటు పొడుస్తూ
కాసుల్ని ఎరగా చూపి
మాయ మాటలు చెప్పి
ఆడపిల్లల శీలానికి వెలకట్టి వెలయాల్ని చేస్తున్నారు
డబ్బుకు లోకం దాసోహమన్నట్లు
డాక్టర్లు డబ్బుకు అమ్ముడు పోతూ
అబార్బన్ల పేరుతో భృణహత్యలు చేస్తున్నారు
తల్లో నాలుకలా అందరితో ఉంటూనే
చీటీల పేరుతో లక్షల్లో డబ్బులు వసూలు చేస్తూ
నమ్మిన వారినే నట్టేట ముంచుతున్నారు
స్వాములు దేవదూతలమంటూ
భక్తులిచ్చే కానుకలందుకుంటూ
అబలల అమాయకత్వాన్ని పసిగట్టి
దైవత్వానికి తిలోదకాలిస్తూ
ఆడవారి మాన ప్రాణాలు కబళిస్తున్నారు
కొందరు ఆచార్యులు కీచకులుగా మారి
బాలికల్ని గర్భవతులుగా మారుస్తూ
ఆచార్య వృత్తికి కళంకం తెస్తున్నారు
నిదానమే ప్రధానమనే నానుడి వీడి
మత్తుమందులకు బానిసలౌతు
సెల్ ఫోనుల్లో మాట్లాడుతూ
వాహనాల్ని నిర్లక్ష్యంగా నడిపేస్తూ
అమాయకుల ప్రాణాలు హరిస్తున్నారు
మన వాహన చోదకులు
కారల్ మార్క్స్ మతం ఒక మత్తు మందన్నట్లు
నేడు కుల,మత సంఘర్షణలో
రుదిరం ఏరులై పారుతోంది.
నీతి అవినీతిని ఆశ్రయిస్తుంటే
ధర్మం అధర్మానికి కొమ్ము కాస్తుంటే
చట్టాలు దుర్మార్గుల చుట్టాలైతే
ప్రభుత్వం ఏమిచేయలేక చూస్తూంటే
ప్రజలు ఎవరిని నమ్మాలి?ఎవరికి మొరపెట్టుకోవాలి?
దేవుడా నీవే దిక్కు?
చూపవా మాకొక దిక్కు (మార్గం)?
చూపవా మాకొక దిక్కు (మార్గం)?
******************************
A to Z వివాహ వేడుక
చూపులు కలిసిన శుభవేళ కార్యక్రమంలో
రాజాలాంటి చిన్న రోజాలాంటి దేవితో
నువ్వునాకు నచ్చావంటూ మనసులో మాట చెప్పగా
గ్రీకు వీరుడ్ని చారులత ఓరకంట చూస్తూ
మునివేళ్ళతో ముత్యాల ముగ్గు వేస్తూ
ముద్దమందారంలా సిగ్గుపడుతూ పెళ్ళికి సై అనగా
పెద్దమనుషులు ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారనగా
సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు క్రింద
తల్లిదండ్రులు తాంబూలాదు లందుకోగా
రెండిళ్ళ పూజారి పెళ్ళిపుస్తకం తెరిచి
సీతారాముల కళ్యాణానికి శుభలగ్నం నిర్ణయించగా
రేసుగుర్రంపై వధువు చిరుతపై వరుడు
దేవాలయంలాంటి పెళ్ళిపందిరిలోకి అడుగిడి
పెళ్ళిపీటలపై ఇద్దరూ కూర్చోగా
వరుడు వధువు మెడలో తాళి కట్టగా
జనమంతా వారిద్దరిపై అక్షింతలు జల్లగా
ఆలుమగలిద్దరూ తలంబ్రాలు పోసుకుంటూ
శ్రీరాములయ్య సన్నిధిలో ఒక్కటై
పెళ్ళి పుస్తకంలోని మొదటి పేజీ పూర్తిచేసి
పండంటి కాపురమనే రెండవ పేజీని తెరచి
కొత్తకోడలు అత్తారింటికి దారేదంటూ అడుగగా
మామగారు సకుటుంబ సపరివారంతో కూడి
కొత్తజంటకు సుస్వాగతమంటూ
శాంతి నివాసంలోకి ఆహ్వానం పలుకగా
భార్యాభర్త లిద్దరూ గృహప్రవేశం చేయగా
కోడలుపిల్ల గృహలక్ష్మి యై
దేవుళ్ళకు దీపారాధన చేసి
అమ్మోరు దీవెన లందుకొని
పచ్చని సంసారానికి శ్రీకారం చుట్టి
వారసుడు సినిమా చూస్తూ రెండు రెళ్ళు ఆరంటూ
సంసార సాగరంలో విహరిస్తున్నారు.
***********************************
ఆరోగ్యమే మహాభాగ్యం
చదవండి! ఆచరించండి! అందరికి చెప్పండి!
నాడు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు కానీ నేడు ఆ పెద్దలతో పాటు పిల్లలు కూడా ఆ విషయాన్ని పెడచెవినపెడుతూ అనేక చెడు అలవాట్లకు బానిసలై
జీవితాన్ని ఛిద్రం చేసుకుంటూ మృత్యుముఖం చేరుకుంటున్నారు. వారు తమ ఆశల్ని ఆశయాల్ని కాలరాసుకుంటూ క్యాన్సర్, క్షయ వంటి భయంకరమైన వ్యాధులతో కన్నుమూస్తున్నారు. అయినవారి కన్నీటికి కారణమౌతున్నారు.
కారణము ఈ క్రింది వాటిని వాడటమే అవి
************************
1.హుక్కాచుట్ట,బీడి,సిగరెట్, గంజాయి వంటివి కాల్చడం
2.గుడుంబా,సార,బ్రాంది, విస్కీ వంటి వాటిని త్రాగడం.
3.మాదకద్రవ్య పదార్ధాలైన బ్రౌన్ షుగర్, హెరాయిన్, కొకైన్,ఇంజెక్షన్లు ,గుట్క, జరద పాన్ పరాగ్ లు వాడటం
4. పిజ్జా, బర్గర్లు వంటి ఫుడ్స్ తినడం.
5. కూల్ డ్రింక్స్ లో కాలరీస్, యాసిడ్స్ మాత్రమే ఉంటాయి.
వీటివల్ల ఊబకాయం, పళ్ళు పాడైపోవటం, పేగుల్లో అల్సర్లు వంటివివస్తాయి, ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధి కారకాలైన వాటికి దూరంగా ఉండండి.
"పెద్దలమాట చద్దన్నం మూట అనే నానుడిని అక్షర సత్యంగా భావించి పెద్దలు ఆచరిస్తూ పిల్లలకు మార్గదర్శకులుకండి . మీఆరోగ్యమే అయిన వారికి అందించును సంతోషం.
తల్లిదండ్రులారా పిల్లలు ఏమిచేస్తున్నారో డేగకళ్ళతో గమనిస్తూసన్మార్గంలోనడిపిస్తూ ఆరోగ్యానికి, భవిష్యత్తుకు మార్గదర్శకులుకండి
ఆస్తులు ఇవ్వటం ముఖ్యంకాదు-మంచి ఆరోగ్యం అందించటమే ముఖ్యం.
ఇట్లు,
మీ శ్రేయోభిలాషి
యేటూరి మురళీకృష్ణ కుంమార్
******************************
***********************************
ఆరోగ్యమే మహాభాగ్యం
చదవండి! ఆచరించండి! అందరికి చెప్పండి!
నాడు ఆరోగ్యమే మహాభాగ్యమన్నారు పెద్దలు కానీ నేడు ఆ పెద్దలతో పాటు పిల్లలు కూడా ఆ విషయాన్ని పెడచెవినపెడుతూ అనేక చెడు అలవాట్లకు బానిసలై
జీవితాన్ని ఛిద్రం చేసుకుంటూ మృత్యుముఖం చేరుకుంటున్నారు. వారు తమ ఆశల్ని ఆశయాల్ని కాలరాసుకుంటూ క్యాన్సర్, క్షయ వంటి భయంకరమైన వ్యాధులతో కన్నుమూస్తున్నారు. అయినవారి కన్నీటికి కారణమౌతున్నారు.
కారణము ఈ క్రింది వాటిని వాడటమే అవి
************************
1.హుక్కాచుట్ట,బీడి,సిగరెట్, గంజాయి వంటివి కాల్చడం
2.గుడుంబా,సార,బ్రాంది, విస్కీ వంటి వాటిని త్రాగడం.
3.మాదకద్రవ్య పదార్ధాలైన బ్రౌన్ షుగర్, హెరాయిన్, కొకైన్,ఇంజెక్షన్లు ,గుట్క, జరద పాన్ పరాగ్ లు వాడటం
4. పిజ్జా, బర్గర్లు వంటి ఫుడ్స్ తినడం.
5. కూల్ డ్రింక్స్ లో కాలరీస్, యాసిడ్స్ మాత్రమే ఉంటాయి.
వీటివల్ల ఊబకాయం, పళ్ళు పాడైపోవటం, పేగుల్లో అల్సర్లు వంటివివస్తాయి, ఇలాంటి ప్రమాదకరమైన వ్యాధి కారకాలైన వాటికి దూరంగా ఉండండి.
"పెద్దలమాట చద్దన్నం మూట అనే నానుడిని అక్షర సత్యంగా భావించి పెద్దలు ఆచరిస్తూ పిల్లలకు మార్గదర్శకులుకండి . మీఆరోగ్యమే అయిన వారికి అందించును సంతోషం.
తల్లిదండ్రులారా పిల్లలు ఏమిచేస్తున్నారో డేగకళ్ళతో గమనిస్తూసన్మార్గంలోనడిపిస్తూ ఆరోగ్యానికి, భవిష్యత్తుకు మార్గదర్శకులుకండి
ఆస్తులు ఇవ్వటం ముఖ్యంకాదు-మంచి ఆరోగ్యం అందించటమే ముఖ్యం.
ఇట్లు,
మీ శ్రేయోభిలాషి
యేటూరి మురళీకృష్ణ కుంమార్
******************************
కాలుష్యం
మేల్కొనండి చదవండి ఆచరించండి
ప్రకృతి నాశనానికి, మానవుల మనుగడకు,ఓజోన్ పొర దెబ్బతినటానికి కారణభూతమైనది కాలుష్యం.
కాలుష్యం మొత్తం 4 రకాలుగా జరుగుతోంది
1.జల కాలుష్యం :
---------------------------
కర్మాగారాల నుండి వచ్చే వ్యర్థ పదార్థాల వల్లను నీటి వల్లను పశువులను కడగటం వల్లను బట్టలు ఉతకటం
వల్లను జంతు చర్మాలు శుభ్రం చేయడం వల్లను జంతుకళేబరాల వల్లను విషపదార్ధాలు
కలవటంవల్లను జలకాలుష్యం అవుతోంది
నష్టాలు.
------------
డయేరియా, కలరా, చర్మవ్యాధులు, టైఫాయిడ్, ఒక్కొక్క సారి ప్రాణాలు పోవచ్చును
2.వాయుకాలుష్యం:
----------------------------
కర్మాగారాల నుండి, హోటళ్లనుండి, వాహనాల నుండి, వ్యర్థ పదార్థాలు కాల్చటం, వల్ల బాణాసంచా కాల్చటం, సిగరెట్, బీడి, చుట్ట, మొదలగు వాటి వల్ల వచ్చే విషపూరిత గాలుల వల్ల వాయుకాలుష్యం ఏర్పడుతోంది బాణాసంచా కాల్చటం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయి
నష్టాలు.
-------------
ఊపిరితిత్తులుదెబ్బతినటం, అల్సర్లు రావటం, తలనొప్పి, గ్యాస్ ట్రబుల్, క్యాన్సర్, క్షయ వంటి అనేక వ్యాధులు వస్తాయి
3.శబ్దకాలుష్యం:
-------------------------
కర్మాగారాల నుండి, వాహనాల నుండి, మైకుల నుండి, విచణారహితంగా బాణాసంచా కాల్చటం వల్ల హారన్ల వల్ల శబ్దకాలుష్యం ఏర్పడుతోంది
నష్టాలు.
------------
తలనొప్పి,చెవుడు,విసుగు,చిరాకు,కోపం,రక్తపోటు, కళ్ళుమంటలు, వికారం
4.భూమి కాలుష్యం :
------------------------------
మృతకళేభరాల వల్లను, వ్యర్థ పదార్థాల వల్లను, ప్లాస్టిక్ కవర్ల వల్లను, క్రిమిసంహారక మందులు వాడటం వల్లను,
భూమి కాలుష్యం బారిన పడుతున్నది
నష్టాలు.
-------------
భూసారం దెబ్బతినటం, భూమి విషతుల్యంగా మారటం మొక్కలు బ్రతకకపోవటం విషవాయువులు భూమి నుండి బయటకు రావడం
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
-------------------------------------
1 . నీటిని పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి
2.నీటిని కలుషితం చేసే వ్యర్థ పదార్థాలు మొదలైన వాటిని కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
3.అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాహనాలు వాడాలి
4.ఎక్కువగా సైకిల్ గానీ నడవడం గానీ చెయ్యాలి
5.వాయురహిత కర్మాగారాలను మరియు వాహనాలను ఉపయోగించాలి
6.సోలార్ సిస్టమ్ వాడటం వల్ల వాయుకాలుష్యం ఉండదు
7.ప్లాస్టిక్ కు సంబంధించిన వస్తువులను, కవర్ల ను వాడకం తగ్గించుకోవాలి.
8.లౌడ్ స్పీకర్లు వాడకుండా చూడాలి
9.అనవసరంగా హారన్లు మ్రోగించకుండా చూడాలి
10.బాణాసంచా వాడకాన్ని తగ్గించాలి
11.చెట్లను పెంచాలి
ఇట్లు
మీ శ్రేయోభిలాషి
యేటూరి. మురళీ కృష్ణ కుమార్
స్థూల కాయం(ఊబకాయం, అధికబరువు)
బొద్దుగా ముద్దుగా ఉన్న పిల్లల్ని అందరూ ఇష్టపడతారు కానీ వయసుకు మించి లావు ఉంటే దానిని స్థూల కాయం అంటారు
పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా స్థూలకాయంతో బాధపడుతున్నారు
స్థూలకాయం రావటానికి కారణాలు
వంశపారంపర్యంగా రావడం
పంచదార, మీగడ, వెన్న, జున్ను,
నెయ్యి, డాల్డా, నూనెలతో చేసిన పిండివంటలు, ఫాస్ట్‌ఫుడ్స్ ,చిరితిండ్లు, వేపుడు కూరలు, మాంసం, గుడ్లు ఎక్కువగా తినడం వల్ల, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని ఉండటం వల్ల స్థూలకాయం వస్తుంది
దీని వల్ల డయాబెటిస్ (షుగర్ వ్యాధి), ఎక్కువ దూరం నడవలేకపోవడం , త్వరగా అలసిపోవడం, శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆకుకూరలు, పీచు పదార్థం ఎక్కువగా ఉన్న కూరగాయలు తినాలి,
పంచదార, స్వీట్స్,ఫాస్ట్‌ఫుడ్స్, చిరితిండ్లు, వేపుడు కూరలు, మాంసం, గుడ్లు తినడం తగ్గించాలి
యోగ, వ్యాయామం చేయడం వాహనాల వాడకం తగ్గించి వాకింగ్ చేయడం సైకిల్ తొక్కడం వల్ల ఊబకాయాన్ని తగ్గించవచ్చు.
స్థూల కాయం(ఊబకాయం, అధికబరువు)
బొద్దుగా ముద్దుగా ఉన్న పిల్లల్ని అందరూ ఇష్టపడతారు కానీ వయసుకు మించి లావు ఉంటే దానిని స్థూల కాయం అంటారు
పిల్లలతో పాటు పెద్ద వాళ్ళు కూడా స్థూలకాయంతో బాధపడుతున్నారు
స్థూలకాయం రావటానికి కారణాలు
వంశపారంపర్యంగా రావడం
పంచదార, మీగడ, వెన్న, జున్ను,
నెయ్యి, డాల్డా, నూనెలతో చేసిన పిండివంటలు, ఫాస్ట్‌ఫుడ్స్ ,చిరితిండ్లు, వేపుడు కూరలు, మాంసం, గుడ్లు ఎక్కువగా తినడం వల్ల, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ సేపు కదలకుండా కూర్చుని ఉండటం వల్ల స్థూలకాయం వస్తుంది
దీని వల్ల డయాబెటిస్ (షుగర్ వ్యాధి), ఎక్కువ దూరం నడవలేకపోవడం , త్వరగా అలసిపోవడం, శరీరంలో కొవ్వు ఎక్కువగా ఉండడం వల్ల రక్త ప్రసరణకు అంతరాయం కలిగి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆకుకూరలు, పీచు పదార్థం ఎక్కువగా ఉన్న కూరగాయలు తినాలి,
పంచదార, స్వీట్స్,ఫాస్ట్‌ఫుడ్స్, చిరితిండ్లు, వేపుడు కూరలు, మాంసం, గుడ్లు తినడం తగ్గించాలి
యోగ, వ్యాయామం చేయడం వాహనాల వాడకం తగ్గించి వాకింగ్ చేయడం సైకిల్ తొక్కడం వల్ల ఊబకాయాన్ని తగ్గించవచ్చు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి