ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

వేడుకలు



నూతన సంవత్సరం
సంవత్సరం
నూతన సంవత్సరం
కోటి కాంతులతో
క్రొంగొత్త ఆశలతో  
బంధు మిత్రులతో
ఆట పాటలతో
చిన్నారులకేరింతలతో
ఎదురు చూపులతో
నడిరేయి వేళ
తారా చంద్రుల వెలుగుల్లో
తారాజువ్వల సవ్వడిలో
గతానికి వీడ్కోలు పలుకుతూ
కొత్త సంవత్సరానికి ఆహ్వానం
పలుకుదాం
***************************
సంక్రాంతి
ఇంట్లో పాడిపంటలు
వీధుల్లో భోగిమంటలు
ఊరంతా కోడిపందేలు
ఊరూరా బసవన్నల నృత్యాలు
వీధివీధులా హరిదాసు కీర్తనలు
ప్రతి ఇంటా మగువలు రంగవల్లులతో
ముంగిట్లో గొబ్బెమ్మలతో
16 అణాల తెలుగుదనంతో
ఇల్లంతా మువ్వలసవ్వడితో
చిన్నారులు కొత్త బట్టలతో
పతంగాల విన్యాసాలతో
వీధుల్లో సందడి చేస్తుంటే
అమ్మలు పిండి వంటలతో
నోరూరించే పాయసంతో
ఇల్లంతా ఘుమఘుమలు అందిస్తూ
కంచి పట్టు చీరలతో కనిపిస్తూ
కొత్త అల్లుళ్లకు మర్యాదలు చేస్తూ
చిన్నారులకు భోగిపళ్లు పోస్తూ
అందరూ విందు వినోదాలతో
బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తూ
సంక్రాంతి పండుగ జరుపుకుంటారు.
*******************************
గణతంత్రదినోత్సవం
పారతంత్ర్యాన్ని పారద్రోలాలని
సత్యం, ధర్మం, అహింసలనే ఆయుధాలతో
నిరాహార దీక్షలు చేబూని
Do or Die నినాదంతో
శాంతియుత పోరాటంతో
దేశ ప్రజలను ఒక్కత్రాటిపై నడిపించి
స్వాతంత్ర్యోద్యమాన్ని సాగించి
బానిస విముక్తులను గావించి
స్వాతంత్ర్యం సాధించారు
మన జాతిపిత గాంధీజీ
నడిరేయి వినీలాకాశంలో
త్రివర్ణపతాకం ఎగురవేసి
స్వాతంత్ర్యదినోత్సవం జరుపుకున్నాము
అలీన ఉద్యమ రధసారధి
భారత తొలి ప్రధాని
మన శాంతి దూత నెహ్రూజీ
భారత రాజ్యాంగాన్నిలిఖించి
రాజ్యాంగ పితామహుడయ్యారు
మన భారత రత్న అంబేద్కర్
ఎందరో నాయకుల త్యాగఫలితమే
మన స్వపరిపాలనా దినోత్సవం
అదే జనవరి 26 గణతంత్ర  దినోత్సవం
అందరం కలిసి పలుకుదాం
స్వతంత్ర భారత్ కీ జై
*************************
ఉగాది
ప్రకృతి ప్రసాదించిన
ఉప్పు,కారం, పులుపు, వగరు, తీపి, చేదనే
షడ్రుచులతో చేసిన
ఉగాది పచ్చడితో
మానువునిలో దాగున్న
కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలనే
అరిషడ్ రోగాలను తుదముట్టించి
ప్రశాంత జీవితం గడిపేలా
పంచాంగ శ్రవణంతో
తెలుగువారి ముంగిలిలోకి
తొలి తెలుగు పండుగగా
అడుగిడిన పండుగ
మనం జరుపుకుంటున్న
తెలుగు సంవత్సరాది పండుగ
అదే మనందరి ఉగాది పండుగ
********************************
దీపావళి
సాయంసంధ్య వేళ
ముంగిళ్ళన్నీ దీపాలతో
ఆడ, మగ అనే తేడా లేకుండా
నూతన వస్త్రాలు ధరించి
ఆనందాల కేరింతల మధ్య
ఇంటిల్లిపాది జరుపుకునే పండుగలో
నేలను చుట్టేస్తాయి భూచక్రాలు
భూమ్యాకాశాల నడుమ సంచరిస్తాయి విష్ణు చక్రాలు
చిటపటలాడతాయిసీమటపాసులు
నక్షత్రాలను సృష్టిస్తాయి
చిచ్చుబుడ్లు
డాం డాం అంటాయి లక్ష్మిబాంబులు
తెల్లని కాంతిని వెదజల్లుతాయి మతాబులు
నేలను తాకి పేలతాయి నేల టపాకాయలు
ఆకాశాన్ని చీలుస్తామంటాయితారాజువ్వలు
నేలపై టపాసుల హెూరు
నింగిలో వెలుగుల జోరు
రాత్రిని పగలులా భ్రమింప చేస్తూ
పౌర్ణమి నాటి చంద్రుడ్ని చేస్తూ
అందరి జీవితాల్లో వెలుగు నింపే పండుగ
మన దీపాల దీపావళి పండుగ
*********************************************
మాతృభాషా దినోత్సవం
పూర్వం తేనెలూరు తెలుగు భాషా
మాధుర్యం గూర్చి
రాయలు "దేశ భాషలందు తెలుగులెస్స" అంటే
విదేశీయులు "ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్" అని కీర్తించారు.
అలాంటి తెలుగుభాష
నాడు సవతి తల్లి ప్రేమకు నోచుకుంటే
తెలుగు భాషాభిమానియైన
గిడుగువారు పిడుగులాచెలరేగి
గ్రాంధిక భాషపై ధ్వజమెత్తి
వ్యవహారిక భాషోద్యమాన్ని గావించి
తేటతెలుగు పదాలతో రచనలు చేసి
పల్లెపల్లెకు, గడపగడపకు
మాతృభాషా సుగంధ పరిమళాలనందించి
తెలుగుభాషకై అవిశ్రాంతంగా శ్రమించిన
తెలుగు భాషా కృషీవలుడు మనగిడుగు రామమూర్తి
ఆయన పుట్టినరోజైన ఆగష్టు 29 ని
మనరాష్ట్రప్రభుత్వం మాతృభాషాదినోత్సవంగా ప్రకటించి
ఆయన కీర్తికి నీరాజనాలర్పించింది
మనం ఎన్నిభాషలు నేర్చినా మాతృభాషను మరువరాదు
*******************************************
బాలల  దినోత్సవం
మోతీలాల్ స్వరూపల గారాలపట్టి
విజయలక్ష్మి, కృష్ణల ముద్దుల అన్న
లండన్లో బారిస్టర్ చదివి గాంధీజీతో స్నేహం చేసి
స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని
స్వాతంత్ర్య సమర యోధునిగా
అఖిల భారత కాంగ్రెన్ అధ్యక్షుడిగా
సంపూర్ణ స్వరాజ్యం కాంక్షించాడు
పారతంత్ర్యాన్ని తొలగించి
స్వాతంత్ర్యసముపార్జనకు కృషి చేశాడు
వక్తగా, రచయితగా, శాంతిదూతగా
అలీన ఉద్యమసారధిగా
భారత తొలి ప్రధానిగా
భారతావనికి సేవలందించారు
ఆ సేవలకు మెచ్చిన భారతదేశం
ఆయన జన్మదినోత్సవమైన నవంబరు 14 ను
బాలల దినోత్సవంగా ప్రకటించి,
భారతరత్నతో సత్కరించింది
ఆయనే చాచా నెహ్రూ
మన పండింట్ జవహర్ లాల్ నెహ్రూ
***************************************
ఉపాధ్యాయ దినోత్సవం
పేద కుటుంబము నందు
వీరాస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించి
చదువేలోకంగా భావించి
ఉపకార వేతనాలతో విద్యనేర్చి
దేశవిదేశాలన్నీ తిరిగారు
ప్రాఫెసర్గా, రచయితగా
దౌత్యవేత్తగా, వైస్ ఛాన్సలర్గా
తొలి ఉపరాష్ట్రపతిగా, ద్వితీయ రాష్ట్రపతిగా
భారతదేశానికి అమూల్యసేవలందించి
ఉపాధ్యాయులకీర్తి ప్రతిష్టలు ఇనుమడింపజేసిన
ఉత్తమ ఉపాధ్యాయుడు డా| రాధాకృష్ణన్
ఆ మహనీయుని సేవలకు ముగ్దురాలైన భారతావని
ఆయన పుట్టినరోజైన సెప్టెంబరు 5 ను
ఉపాధ్యాయ దినోత్సవముగా ప్రకటించి
భారతరత్న అవార్డుతో సత్కరించింది
********************************************
వధూవరుల పెళ్ళి సందడి
మామిడి తోరణాలతో
మల్లెల మాలల పరిమళాలతో
ముస్తాబైన పెళ్ళిపందిరితో
ముద్దగుమ్మలంతా పరికిణీలతో
ముత్తైదువులంతా పట్టు చీరలతో
మగవారంతా పట్టు వస్త్రాలతో
స్నేహితుల సరదాలతో
చిన్నారులకేరింతలతో
బంధువుల సందడిలో
అత్తరు పన్నీటిజల్లులతో
స్వాగత సత్కారాలతో
మొదలయ్యింది పెళ్లి సందడి
కళకళలాడింది పెళ్ళిపందిరి
పెళ్ళిపీటలపై వరుడు
క్రీగంటి చూపులతో
వధువు రాకకై ఎదురుచూస్తుంటే
వధువు పట్టు పీతాంబరాలతో
పద్మంలాంటి మోముతో
పసిడి ఆభరణాల శోభతో
నుదుట బాసికంతో
16 అణాల తెలుగు సాంప్రదాయంతో
పున్నమి నాటి జాబిల్లిలా
నవరత్నాల మధ్య కోహినూరులా
పుత్తడి బొమ్మలా
మేలి జలతారు ముసుగుతో
అరమోడ్పుకన్నులతో
అదురుతున్న అధరాలతో
ఎరుపెక్కిన చెక్కిళ్ళతో
ఝల్లుమంటున్న హృదయంతో
తడబడు నడకలతో
పెళ్ళిపందిరిలోకి అడుగుపెట్టి
తన్మయత్వంతో చూస్తూవరుడ్ని
సిగ్గుల మొగ్గ అయిన వధువు
పెళ్ళిపీటలపై ఒదిగి కూర్చున్నది
వేదపండితుల నడుమ
మంగళవాయిద్యాలతో
అగ్నిదేవుని సాక్షిగా
పెద్దల ఆశీస్సులతో
శుభ ముహూర్తపు వేళ
మూడుముళ్ళబంధంతో
ముత్యాల తలంబ్రాలతో
నవ వధూవరులు ఒక్కటైరి

*************************************

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శతక లక్షణాలు, శతక కవులు

 శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108) శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి  200లపద్యాలు, పంచశతి  500ల పద్యాలు,సప్తశతి  700ల పద్యాలు  2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు)  3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం)  4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం  5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు 6. ఆత్మాశ్రయభావన నియమం  7. ఉదాహరణలతో  వివరించటం  పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు .1) భక్తి 2) శృంగార 3) నీతి  4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా  8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర  11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక  13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు                    * శతక కవులు * 1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం   సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర  2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం,  వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం  3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ...

చెలి నీవెవరు

ముందుమాట " చెలి నీ వెవరు " అనే కవితా సంపుటి నిశీధివేళ ఒంటరిగా నేను స్వప్నంలో విహరిస్తుంటే మేలి జలతారు ముసుగులో తాను తారసపడి నాతో నడుస్తూ ఎన్నో ఊసులు చెబుతూ ఒంటరి తనాన్ని దూరంచేస్తూ నేనున్నానని బాస చేసి ప్రాతః సమయాన నన్ను నిద్రలేపి మాయమయ్యేది. తన మాటల్లోని భావాలను తన సుందర రూపాన్ని గుర్తు చేసుకుంటూ అరుణోదయాన అక్షరరూపం కల్పిస్తూ తనను కవితల్లో చూసుకుని మురిసిపోతూ నా దినచర్యను కొనసాగి స్తూ రాత్రి ఎప్పడౌతుందా అని ఎదురుచూస్తూ కనిపించని మనిషిని అన్వేషిస్తూ ఈ కవితా సంపుటిని వ్రాయటం జరిగింది. ఇట్లు , మీ యేటూరి మురళీకృష్ణ కుమార్ ********************************************** నేనెవరో తెలుసా పారే సెలయేరు నడుగు పండు వెన్నెల నడుగు చల్లగాలి నడుగు పరవశించే ప్రకృతి నడుగు గానానికి మైమరచిన గోవుల నడుగు గోవర్ధనగిరి నడుగు ఆరాధించే గోపికల నడుగు నన్ను ప్రేమించిన రాధ నడుగు అందరి ఆరాధ్య దేవుడిని నేను   మీ మురళీ కృష్ణుడిని నేను ***************************** చెలీ నీవెవరు ? నీ మోము చూస్తే పున్నమి నాటి చంద్రుడ్ని తలపిస్తోంది నీ నవ్వులోని స్...

దేశం - రాష్ట్రం - తెలుగు భాష ఔన్నత్యం

మన దేశం భారత దేశం మన దేశం శత్రు దుర్భేద్యమైనది భారతదేశం అలీన రధసారధి మన దేశం శాంతి సమానత్వ సౌభ్రాతృత్వం గలది మన దేశం లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మన దేశం భిన్నత్వంలో ఏకత్వ స్వరూపమే మన దేశం చారిత్రక కట్టడాల నిలయం మన దేశం కళలకు పుట్టినిల్లు మన దేశం నవరసాల మేళవింపు మన దేశం పున్నమి నాటి చంద్రుని వంటిది మనదేశం మన దేశం భారత దేశం ------------------------------------------------------ ఈ దేశం మనది భారతదేశ దాశ్య శృంఖలాలు తొలగించడానికి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి భగత్ సింగ్ నేతాజీ వంటి వారు ఆయుధాలు ధరించి విడివిడిగా యుద్ధాలు చేసి ప్రాణాలు విడిచారు కొందరు మితవాదులు కరపత్రాల ద్వారా నినాదాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా ఫలితం శూన్యం లాల్ బాల్ పాల్ వంటి అతివాదులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు కారణం విడివిడిగా పోరాడటమే ఆయుధం ధరించిన వాడు ఆయుధంతోనే మరణిస్తాడనే విషయం గ్రహించిన గాంధీజీ సత్యం అహింస శాంతి అనే ఆయుధాలు ధరించి డూ ఆర్ డై అనే నినాదంతో ప్రజలందరిలో స్వాతంత్య్ర కాంక్షను రగుల్కోపి ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపండంటు ఒకే ...