యేటూరి.పాండురంగారావుగారు
-----------------------------------------
మా నాన్న గారికి బెస్ట్ E.O.అవార్డు వచ్చినందుకు
ఇవే మా శుభాకాంక్షలు 26.1.2001
మా ఇంటికి బిగ్ బాస్
వృత్తిలో మెగాస్టార్
స్నేహంలో సూపర్ స్టార్
శత్రువుల గుండెల్లో రెబల్ స్టార్
అవార్డులందుకోవటంలో రియల్ స్టార్
ఈ స్టార్ ఎవరా అనుకుంటున్నారు?
ఆయనే మా నాన్న వై. పి. ఆర్.
పదవీ విరమణ శుభాకాంక్షలు 30.9.2001
మనలో ఒకడు
మనందరివాడు
మన పాండు రంగారావు
ఆప్తుడై, హితుడై, బంధువై
కలిసున్నాడు నేటి వరకు
ఈ రోజు ఉద్యోగ బాధ్యతలు ముగిస్తూ
పదవీ విరమణ గావిస్తూ
మనందరిని వీడి వెళుతున్నాడు మనవాడు
రేపుండకూడదు మన మధ్య దూరం
ఎల్లప్పుడు కలిసుండాలి మనమందరం
అందుకే మనమివ్వాలి నూతనోత్సాహం
భగవంతుడివ్వాలి ఆయురారోగ్యాలు
--------------------------------------------
నీరాజనం -
యేటూరి. వేణుగోపాలరావు గారికి
యేటూరి వంశమందు
సూర్య ప్రకాశరావు దుర్గమ్మ దంపతులకు
తృతీయ కుమారుడిగా జన్మించాడు
మన వేణుగోపాలరావు
రేపల్లె లాంటి పొణుకుమాడులో
తోటి గోపబాలురతో విద్య నేర్చిన 'వేణు'మాధవుడు
బృందావనం లాంటి కోదాడ చేరి
ఉద్యోగ బాధ్యతలు నెరవేర్చిన' గోపాలు'డు
నాడు అందరితో సరదాగా స్నేహంగా
కలుపుగోలుగా తల్లో నాలుకలా మెలిగిన 'రావు' గారు
నేడు ఆయన అందరిని వదిలి వెళ్ళినా
ఆయన అందరికి అందించారు మధుర స్మృతులు
అందరూ కలిసినప్పుడు తలుచుకోవాలి ఒక్క సారి
అదే మనం ఆయనకిచ్చే నిజమైన నీరాజనం
----------------------------------------------------
అందం
మోముకు సంతూరుపౌడరు అందం
నుదుట సింగారు తిలకం అందం
కళ్ళకు ఐటెక్స్ కాటుక అందం
మేనుకు కంచి పట్టు చీర అందం
కాళ్లకు పారాణి అందం
మగువల అందాన్ని మరింత పెంచేవి
అందరిలో మరింత గుర్తింపు నిచ్చేవి
స్వర్ణాభరణాలే కదా!
ఆబాలగోపాలాన్ని రకరకాల డిజైన్లతో
ఆకట్టుకునే షోరూమ్
మన కళ్యాణ్ జూలర్స్
---------------------------------
కృతజ్ఞతాభివందనములు
'స్పం'దిస్తూ ప్రోత్సహించే పెద్దలకు
'ద'యార్థ హృదయులైన దాతలకు
'న'న్ను అభిమానించే అభిమానులకు
'అనే'క కార్యక్రమాలు నిర్వహించే సిబ్బందికి
'నేను' పిలవగానే వచ్చే కళాకారులకు
'మీకు' హృదయ స్పందనతో
నా కృతజ్ఞతలందిస్తున్నాను
ఇట్లు
మీ స్పందన
ఆర్ట్స్ కల్చరల్ అసోసియేషన్
గుడివాడ
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఆకాశాన్ని పందిరిగా చేసి
మేఘాలను మల్లెలతోరణాలుగా అల్లి
నక్షత్రాలతో మెరుగులు దిద్ది
ఉరుముల్ని మెరుపుల్ని
విద్యుత్ దీపాలుగా మలచి
సూర్యచంద్రుల్ని జ్యోతులుగా చేసి
నేలను అరుగుగా మార్చి
పవిత్ర జలాలతో అరుగును శుద్ధిచేసి
ముత్యాలతో ముగ్గులు వేసి
ఇంద్ర ధనస్సును అరుగుపై తివాచిలా పరచి
మరకత మాణిక్యాలను తివాచిపై పూలుగా చల్లి
సుగంధ ద్రవ్యాలను పన్నీరుగా చేసి
అంబికా సువాసనలతో
పిండివంటల ఘుమఘుమలతో
ప్రాంగణాన్ని అందంగా తీర్చిదిద్దాను
నా చెల్లెలు పుట్టిన రోజుకై
ముసి ముసి నవ్వులు చిందిస్తూ
సిగ్గులన్ని ఒలకపోస్తూ
పుత్తడి బొమ్మలా
అమ్మానాన్నలైన జ్యోతి మురళీలతో కలసి
ముస్తాబైన పందిరిలోకి అడుగిడి
జరుపుకుంటోంది పుట్టిన రోజు వేడుక
మా ఇంటి వెలుగుకు
మా కంటి పాపకు
అక్కైన రోహిణి
చెల్లెలైన తేజస్వికి
నవరత్నాలను అక్షింతలుగా వేసి
శుభాకాంక్షలందిస్తున్నాను
అమ్మానాన్నలందించాలి దీవెనలు
దేవతలందించాలి ఆశీస్సులు
అందరూ కోరుకోవాలి
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి