ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

డా.కె.కె.ఆర్ గౌతమ్ పాఠశాల


 


 డా.కె.కె.ఆర్. గౌతమ్ పాఠశాల ప్రాధాన్యత
     ------------------------------------------------

కుటుంబం.... ప్రేమను అనురాగాన్ని అందిస్తుంది
పాఠశాల...... విద్యతో పాటు మానవతా విలువల్ని అందిస్తూ ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతుంది
       రత్నాలు ఎన్నిఉన్నా వజ్రానికి సాటిరావు అన్నట్లుగా
                   పాఠశాలలు ఎన్ని ఉన్నా
   డా.కె.కె.ఆర్ గౌతమ్ స్కూలుకు  సాటిరావు
        అన్నది అక్షర సత్యం
                    ఎందుకంటే మనిషి బ్రతకటానికి కూడు గూడు గుడ్డ ఎంత అవసరమో విద్యార్థికి విద్యతో పాటు శీలం  క్రమశిక్షణ పట్టుదల అంకితభావం  అంతే అవసరమని నమ్మిన పాఠశాల మన డా.కె.కె.ఆర్ గౌతమ్ పాఠశాల  నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి వాటి కోసం              నిరంతరం శ్రమిస్తూ పిల్లల్ని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతూ పిల్లల్లో సృజనాత్మకత తెలివి తేటల్ని అంచనా వేయడానికి టాలెంట్  టెస్టులు నిర్వహించి వారి తెలివి తేటల్ని వారికి తెలియజేసీ వాటిని మెరుగు పరుచుకునేలా ప్రోత్సహిస్తున్న పాఠశాల మన డా.కె.కె.ఆర్ గౌతమ్ పాఠశాల
          ప్రణాళికాబద్ధంగా విద్యనందిస్తూ ప్రగతిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తప్పుల్ని సరిదిద్ది మంచి మార్గంలో నడిపిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తూ మిగిలిన పాఠశాలలకు ఆదర్శంగా నిలిచిన బెస్ట్ స్కూల్
మన  డా.కె.కె.ఆర్ గౌతమ్ స్కూల్
      చీకటిని పారద్రోలి వెలుగు నిచ్చేది గురువు అన్న మాటలకు నూరుశాతం న్యాయం చేస్తున్నారు మన ఉపాధ్యాయులు సందేహాలతో సతమతమవుతూ చీకటిలో ఉన్న మాకు చిరునవ్వుతో సమాధానాలు చెబుతూ వెలుగనే జ్ఞానాన్ని అందిస్తున్నారు మా ఉపాధ్యాయులు
        మాలో భయాన్ని పోగొట్టి మా వెన్నంటే ఉంటూ మాలో చురుకుదనం నింపి చదవటంలో,  వ్రాయటంలో కొత్త కొత్త పద్ధతులు నేర్పి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మా విజయానికి బాసటగా నిలుస్తున్నారు మా ఉపాధ్యాయులు
         విద్యార్థులకు ఉపాధ్యాయులకు వారథిలా నిలిచి సమస్యల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కరిస్తూ విద్యార్థుల ప్రగతిని అంచనా వేస్తూ తగిన సలహాలు సూచనలు అందిస్తూ లక్ష్యాన్ని గుర్తు చేస్తూ విజయాన్ని కాంక్షిస్తూ ఉత్తమ మార్కులు వచ్చిన వారికి పారితోషికాలు అందిస్తామని హామి ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు మా యాజమాన్యం వారు మా భవిష్యత్తు పూలబాటగా ఉండాలని నిరంతరం తపించే  యాజమాన్యం వారికి ఉపాధ్యాయులకు,  బోధనేతర సిబ్బందికి ఇవే మా హృదయపూర్వక కృతజ్ఞతలు.

     *  ప్రియమైన జూనియర్స్ వినండి
            నాదొక విన్నపం మరి *
          -----------------------------
ఎక్కడో పుట్టాము ఎక్కడో పెరిగాము
జి ఐ ఎస్ లో చదువుతున్నాము
నేడు కలిసి ఉన్నాము మనము
రేపు దూరమౌతాము మనము
కానీ అందరి లక్ష్యం ఒక్కటే
మంచి మార్కులు సాధించాలి
పాఠశాలకు మంచి పేరు తేవాలి
చరిత్రలో మన పేర్లు మారుమ్రోగాలి
నీటి మీద రాతలా కాకుడదు నా మాటలు
అక్షర సత్యం కావాలి ఈ మాటలు
కృషి చేస్తారా మరి
---------------------------------------------
        విద్యార్థుల ప్రతిజ్ఞ

మా పాఠశాలను పూదోటగా భావించి
పుస్తకాలను విరబూసిన పూలుగా భావించి
పాఠాలను పుప్పొడిగా భావించి
ఉపాధ్యాయులు తుమ్మెదలై పుప్పొడిపై వాలి
విషయమనే మకరందాన్ని  గ్రోలి
జ్ఞానమనే తేనెగా మార్చి
పిల్లలమైన మాచే త్రాగించి
మాలో క్రొత్త శక్తిని ఆత్మవిశ్వాసాన్ని నింపి
మా విజయానికి సోపానాలు వేశారు
మేమనుకున్నది సాధిస్తామని
మాపై పెట్టుకున్న నమ్మకం ఒమ్ము చెయ్యమని
తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు
పాఠశాలకు పేరు ప్రతిష్టలు తెచ్చేలా
మా పిల్లలంటూ సగర్వంగా చెప్పుకునేలా చేస్తాము
మా జూనియర్స్ కు మార్గదర్శకులమౌతామని
విజయకేతనం ఎగరేస్తామని
ముక్తకంఠంతో చెబుతున్న మాటలివి
మాటలతోనే కాదు చేతలతో  కూడా
నిరూపిస్తామని ప్రమాణం చేస్తున్నాము
-------------------------------------------------
'ప్రపంచానికి వెలుగు నిచ్చేవాడు సూర్యుడు ఒక్కడే
పిల్లలకు ఉత్తమ విద్యనందించేది
డా.కె.కె.ఆర్ గౌతమ్ ఒక్కటే’
............................................................................
‘సూర్యుని నులువెచ్చని స్పర్శకై పద్మము
చంద్రుని చల్లని వెన్నెల స్పర్శకై కలువ
నింగి వైపు ఆశగా ఎదురుచూస్తున్నట్లే
ఉత్తమ విద్యకై విద్యార్థిని విద్యార్థులందరూ
డా.కె.కె.ఆర్ గౌతమ్  వైపే అడుగులు వేస్తున్నారు ‘
......................................................................

పరీక్షల్లో చిరుతల్లా చెలరేగి
ఫలితాల్లో దూకుడు ప్రదర్శించి
పాయింట్స్ లో దమ్ము చూపి
గ్రేడులలో సింహాలుగా నిలిచి
లక్ష్యం సాధించిన విజేతలందరూ
డా.కె.కె.ఆర్ గౌతమ్ స్కూలే నెం.1 అంటూ
మా అందరికీ మరింత ఉత్సాహాన్ని అందించారు
వారందరికీ ఇవే మా హృదయపూర్వక శుభాభినందనలు’
 - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - - -       

డా. కొసరాజు కోటేశ్వరరావు గారికి
      షష్టిపూర్తి శుభాకాంక్షలు
వరలక్ష్మి సూర్యనారాయణ దంపతులకు
జ్యేష్ట పుత్రునిగా జన్మించి
కష్టేఫలి అన్న నానుడికి
సార్థకతను చేకూర్చి
ఇంతింతై వటుడింతై అన్నట్లుగా
ఒక్కొక్కమెట్టు ఎక్కుతూ
రసాయనశాస్త్రంలో డాక్టరేటును పొంది
రసాయనశాస్త్ర అధ్యాపకులు గా
ఎంతోమంది విద్యార్థుల్ని తీర్చిదిద్ది
విద్యావ్యాప్తికి కృషి చెయ్యాలని
తన పేరులో గౌతముడుని చేర్చి
విద్యాసంస్థలు నెలకొల్పిన `కొస` రా’రాజు`
విద్యార్థులనే సంపదగా భావించిన ‘కోటేశ్వరుడు’
అందరికి మార్గదర్శకుడిగా నిలిచిన ‘రావు’
హితుడై స్నేహితుడు ఆప్తుడై
సిబ్బందిని  ఒకే  తాటిపై నడిపిస్తూ
ఉత్తమ ఫలితాలుససాధిస్తూ
బోధన బోధనేతర సిబ్బందిని
తన కుటుంబససభ్యులుగా భావిస్తూ
మానవతా విలువల్ని పంచుతున్న
మహోన్నత వ్యక్తి మన కెకెఆర్ గారు
నేడు 60వ వసంతంలోకి అడుగిడి
షష్ఠి పూర్తివవేడుక జరుపుకుంటున్న
డా.కె.కె.ఆర్ గారు
ఇంకా ఎందరికోచేయూత నివ్వాలని
మరెందరినో తీర్చిదిద్దాలని
భగవంతుడు ఆయనకు ఆయురారోగ్యాలను
అష్టైశ్వర్యాలనూ  అందించాలని ఆశిస్తాను
------------------------------------------------------

బడి
బుడి బుడి నడకల చిన్నారి
ఎక్కడికమ్మ నీ పయనం
నా భవితకై ఆరాటపడే అమ్మానాన్నలు
బతుకులో తడబాటు లేకుండా
జీవితంలో భయం లేకుండా
నా కాళ్ళ మీద నేను నిలబడేలా
నా చేయి పట్టి నడిపించే చోటుకు
నా భుజం తట్టి ధైర్యం చెప్పే చోటుకు
నా గుండె లో ఆత్మవిశ్వాసం నింపే చోటుకు
నా బతుకు మీద ఆశ కలిగించే చోటుకు
నా లక్ష్య సాధనకై కృషి చేసే చోటుకు
అమ్మ ఒడిలాంటి బడికి వెళుతున్నా
ఆ బడే డాక్టర్.కె.కె.ఆర్ గౌతమ్ బడి(పాఠశాల)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శతక లక్షణాలు, శతక కవులు

 శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108) శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి  200లపద్యాలు, పంచశతి  500ల పద్యాలు,సప్తశతి  700ల పద్యాలు  2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు)  3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం)  4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం  5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు 6. ఆత్మాశ్రయభావన నియమం  7. ఉదాహరణలతో  వివరించటం  పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు .1) భక్తి 2) శృంగార 3) నీతి  4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా  8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర  11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక  13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు                    * శతక కవులు * 1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం   సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర  2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం,  వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం  3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ...

చెలి నీవెవరు

ముందుమాట " చెలి నీ వెవరు " అనే కవితా సంపుటి నిశీధివేళ ఒంటరిగా నేను స్వప్నంలో విహరిస్తుంటే మేలి జలతారు ముసుగులో తాను తారసపడి నాతో నడుస్తూ ఎన్నో ఊసులు చెబుతూ ఒంటరి తనాన్ని దూరంచేస్తూ నేనున్నానని బాస చేసి ప్రాతః సమయాన నన్ను నిద్రలేపి మాయమయ్యేది. తన మాటల్లోని భావాలను తన సుందర రూపాన్ని గుర్తు చేసుకుంటూ అరుణోదయాన అక్షరరూపం కల్పిస్తూ తనను కవితల్లో చూసుకుని మురిసిపోతూ నా దినచర్యను కొనసాగి స్తూ రాత్రి ఎప్పడౌతుందా అని ఎదురుచూస్తూ కనిపించని మనిషిని అన్వేషిస్తూ ఈ కవితా సంపుటిని వ్రాయటం జరిగింది. ఇట్లు , మీ యేటూరి మురళీకృష్ణ కుమార్ ********************************************** నేనెవరో తెలుసా పారే సెలయేరు నడుగు పండు వెన్నెల నడుగు చల్లగాలి నడుగు పరవశించే ప్రకృతి నడుగు గానానికి మైమరచిన గోవుల నడుగు గోవర్ధనగిరి నడుగు ఆరాధించే గోపికల నడుగు నన్ను ప్రేమించిన రాధ నడుగు అందరి ఆరాధ్య దేవుడిని నేను   మీ మురళీ కృష్ణుడిని నేను ***************************** చెలీ నీవెవరు ? నీ మోము చూస్తే పున్నమి నాటి చంద్రుడ్ని తలపిస్తోంది నీ నవ్వులోని స్...

దేశం - రాష్ట్రం - తెలుగు భాష ఔన్నత్యం

మన దేశం భారత దేశం మన దేశం శత్రు దుర్భేద్యమైనది భారతదేశం అలీన రధసారధి మన దేశం శాంతి సమానత్వ సౌభ్రాతృత్వం గలది మన దేశం లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మన దేశం భిన్నత్వంలో ఏకత్వ స్వరూపమే మన దేశం చారిత్రక కట్టడాల నిలయం మన దేశం కళలకు పుట్టినిల్లు మన దేశం నవరసాల మేళవింపు మన దేశం పున్నమి నాటి చంద్రుని వంటిది మనదేశం మన దేశం భారత దేశం ------------------------------------------------------ ఈ దేశం మనది భారతదేశ దాశ్య శృంఖలాలు తొలగించడానికి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి భగత్ సింగ్ నేతాజీ వంటి వారు ఆయుధాలు ధరించి విడివిడిగా యుద్ధాలు చేసి ప్రాణాలు విడిచారు కొందరు మితవాదులు కరపత్రాల ద్వారా నినాదాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా ఫలితం శూన్యం లాల్ బాల్ పాల్ వంటి అతివాదులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు కారణం విడివిడిగా పోరాడటమే ఆయుధం ధరించిన వాడు ఆయుధంతోనే మరణిస్తాడనే విషయం గ్రహించిన గాంధీజీ సత్యం అహింస శాంతి అనే ఆయుధాలు ధరించి డూ ఆర్ డై అనే నినాదంతో ప్రజలందరిలో స్వాతంత్య్ర కాంక్షను రగుల్కోపి ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపండంటు ఒకే ...