ముందుమాట
నేడు
సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను ఆధారంగా చేసుకొని వాటినే
నా కవితా వస్తువులుగా స్వీకరించి నిద్రాణమైన సమాజాన్ని ఉత్తేజపరచాలని మేలుకొలుపు, జాగృతి, ధ్రువతారాలు, అక్షరయజ్ఞం, వేడుకల పేర్లతో నా
కవితా సంపుటులు వ్రాయటం జరిగింది. అంతేగానీ ఎవరిని కించపరిచే విధంగా మాత్రము
వ్రాయలేదు.
నా హృదయపూతోటలో
విరబూసినపారిజాతకుసుమాలు
నేను
వ్రాసిన కవితలు నన్ను ప్రోత్సహించి సలహాలందించిన నా తల్లిదండ్రులకు, భార్యకు, అక్కకు, అన్నగారికి, బంధుమిత్ర, శ్రేయోభిలాషులకు నా
హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
--------------------------------------------------------
శ్రేయోభిలాషుల అభిప్రాయాలు
మురళీకృష్ణగారి కవితలు
చదివి నా అభిప్రాయం వ్రాద్దామని మొదలుపెట్టగా మదినిండా భావాలు, మస్తిష్కం నిండా
ఆలోచనలు సుడులుతిరుగుతున్నా అక్షర రూపంలోకి వచ్చేసరికి మాటలు తడబడుతూ, నన్నుఉక్కిరిబిక్కిరి
చేస్తూ,
నాతో ఆటలాడుతుంటే మనసుకు నచ్చచెప్పిఆలోచనలకు కళ్ళెం వేసి, భావాలకు అక్షరరూపం
ఇచ్చి వ్రాస్తున్న మదిలో మాటలు ఇవి. సమాజంలోని ఎన్నో అంశాలను తన కవితల్లో
వివరించటం జరిగింది. కవితలు చదినవారిలో ఉత్తేజం కలిగిస్తూ, ఆలోచనల్నిమేలుకొలుపుతూ, సమాజాభివృద్ధికి
పాటుపడే విధంగా వ్రాయటం జరిగింది. ప్రతి కవిత ఒక ఆణిముత్యం అనటంలో
అతిశయోక్తికాదనుకుంటున్నాను.
-----------------------------------------------------------------------------
చిII యేటూరి మురళీకృష్ణ
కుమార్ గారు వ్రాసిన "కవితా సంపుటులు" చదివిన తరువాత ఒక పది నిముషాలు కళ్ళు మూసుకుని
ప్రశాంతంగా ఆలోచిస్తే కాని వాటిలో అంతర్లీనంగా నిక్షిప్తమై ఉన్న భావాలు, సామాజికస్థితిగతులు ఒక
పట్టాన అవగాహనకాలేదుసుమా! అంటే దానర్థం ఒక పట్టాన తేరుకోలేకపోయానని, ఎందుకంటే ఆనందాబ్దిలో
ఓలలాడేవాడు అందులోనే దొరికే ఆనందాన్ననుభవిస్తూ అక్కడే ఉండాలనుకొంటాడు కదా!
అలాగే చిII మురళీకృష్ణ కుమార్
గారు తన కవితా రచనలో, పాఠకుడి మదిలో నిద్రాణమై ఉన్న చైతన్య శక్తిని మేల్కొలిపి, తన గురించి, తానే ఆలోచించుకొనే
అవకాశంలేని ఈ రోజుల్లో పొరుగువాడి గురించి ఆలోచించటమేకాక, స్వార్దాన్నికొంతైనావిడనాడి
అందరికీ సాయపడాలనేతత్త్వం అలవరుచుకునేలా చేయటం నాకు నచ్చింది.
ఒక్కొక్క కవిత గురించి
వ్రాసుకుంటూపోతే, వారు వ్రాసిన కవితలకంటే ఎక్కువయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రతి కవితకు, కవితల్లోని ప్రతి
పదానికి ఒక వైవిధ్యభరితమైన అర్దాన్ని పాఠకుని హృదయానికి హత్తుకునేలా రచన చేయ
గలిగినందుకు ఆచిరంజీవిని మనసారా, అభిననందిస్తూ, ఆశీర్వదిస్తున్నాను. హృదయాన్నిస్పందింపచేయగలిగేదే మంచి రచన, ఆ రచనా పటిమ రచయితకు
ఉందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. ప్రతి అంశాన్ని కళ్ళకు కట్టినట్లు
ఆవిష్కరించిన ఈ యువ రచయితను మరోసారి అభినందిస్తూ, ఇంకా ఎన్నెన్నో మంచి రచనలు చేయాలని
ఆకాంక్షిసూ నా మీదున్న అభిమానంతో నా అభిప్రాయం వ్రాయమన్నందుకు కృతజ్ఞతలు
తెలుపుకొంటున్నాను.
------------------------------------------------------
శ్రీ యేటూరి
మురళీకృష్ణకుమార్ గారు వ్రాసిన కవితాసంపుటులు నాకందించి నా అభిప్రాయమును వ్రాయమంటే
ఒక్కో కవితను చదువుతుంటే సమాజం మొత్తాన్ని చుట్టేసిన అనుభూతి కలుగుతుంది. సమాజంలోని
ప్రతి సమస్యను మురళీ గారి కలం స్పృశించిన విధం భవిష్యత్తరానికి మార్గనిర్దేశనం
చేసినట్లనిపిస్తుంది. సరళమైన భాషతో, సామాన్యమైన పదవరుసలతో అసామాన్యమైన భావాన్ని బాధ్యతల్ని నవతరానికి
సిరంజితో నింపినట్లనిపిస్తోంది. పాఠశాల విద్యార్ధులు కూడా మన సమాజపు నిజరూపాన్ని
దర్శించేలా మురళీ గారు ప్రయత్నించినట్లు స్పష్టమగుచున్నది. వీరి సాహితీ ప్రయాణం
మునుముందు సమాజాన్ని మరింత సుసంపన్నం చేయాలని హృదయపూర్వకంగా మురళీగారికి
శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
-----------------------------------------------
డాంబిక సమాజం చీకటి
కోణాలు బట్టబయలు చేస్తూ ప్రతిస్పందనతో ద్రవించిన కవి హృదయం ... భ్రష్టు
పట్టిపోతున్న సంస్కృతీ సాంప్రదాయపు విలువలను నిరసిస్తూనిద్రనటిస్తున్న మానవ
మస్తిష్కాలను చర్నాకోలు దెబ్బల్లాంటి తన కవితలతో మేలుకొలుపుతూ బాల్యం, కౌమారం, వార్ధక్యం, బంధాలు, బాంధవ్యాలలోని
మాధుర్యాన్ని తెలియజేస్తూ పల్లె అందాలు, గడుసరి పడుచులు, పచ్చని పొలాలు వినీలాకాశపు వర్ణనలతో ప్రకృతి వైభవం నుంచి దేశభక్తులకు, ఎందరో మహానుభావులకు
వందనాలనర్పిస్తూ మన హృదయాలను కదిలిస్తూ తాను స్పృశించని కోణంలేదు.
శ్రీ మురళీకృష్ణకు, కవితా ప్రపంచంలో
ఉజ్వలమైన భవిష్యత్తును కోరుకుంటూ శుభాశీస్సులతో
-------------------------------------------------------------
మురళీకృష్ణగారి కవితలు
విద్యార్థుల గురించి, మహాపురుషుల గురించి, సమాజంలో కనిపించే అనేక లోపాలను అందరికి అర్థమయ్యే రీతిలో తేట తెలుగు
పదాలతో వ్రాయటం జరిగింది.
కవిత కవితకు ఎంతో
వైవిధ్యం కలదు. చదివిన వారిని ఆలోచింపజేసే విధంగా కవితలు వ్రాయటం జరిగింది.
అంతేకాకుండా చదివిన తరువాత మనిషిలో మార్పు రావటం జరుగుతుందనేది మా నమ్మకం.
ఎందుకంటే ఆయన వ్రాసిన కవితలకు మమ్మల్నితొలి పాఠకుల్ని చెయ్యటం, మాపై అభిమానంతో కవితల
ముద్రణలోని తప్పులను సరిదిద్దమని చెప్పటం, మా సలహాలు స్వీకరించటం
వల్ల పుస్తక రూప కల్పనలో పరోక్షంగా మాకు అవకాశం లభించటం మాకెంతగానో సంతోషాన్ని
కలిగించింది.
-----------------------------------------
శ్రీమురళీకృష్ణగారికి,నాకు పెద్దగా
పరిచయంలేదు. కానీ, ఒకసారో, రెండుసార్లో కలసి మాట్లాడుకోవడం జరిగింది. అది కూడా పట్టుమని పది
నిముషాలు కూడా వుంటుందో. వుండదో. కానీ, ఇంట్లోకి కరెంటు వస్తుందో లేదో తెలుసుకోవడానికి తీగలు పుచ్చుకోవలసిన
పని లేదు. లోపలికి పోయి స్విచ్ వేస్తే చాలు అన్నట్లు, ఆయనలో ఈ వచన రచనాధార
వుందని తెలుసుకోవడానికి గంటలు, రోజులు, వారాలు మాట్లాడుకోవలసిన పని లేకుండా, ఆ మాట్లాడుకున్న కాస్త సమయంలో సరియైన పలుకులు
మనసు తలుపులను తట్టిలేపినప్పుడే అనిపించింది. ఈయనలో ఏదో కొంత భావకత వుంది
అనిపించింది. అది సమాజ శ్రేయస్సును కాంక్షిస్తోంది అని తోచింది. అదేకదా కవిత్వం
యొక్క ప్రయోజనం కూడాను. వీరి బ్రతుకు - భావాల మధ్య అక్షరాలు ఒరుసు కుంటున్నాయి.
వాటికి యింకా స్వేచ్చ కావాలని, వీరికి (రచయితకు) ఉజ్వల భవిష్యత్తు రావాలని. త్రికరణ శుద్దిగా కాంక్షిస్తూ
-----------------------------------------------------------------------------------------------------------
మురళి గారి కవితలు గురించి చెప్ప గలిగినంత మాటలు నాకు, రావు మాది నవ వసంతా ల స్నేహం కాని దానిలో మా స్నేహం లో తనలో కవి ని గుర్తించ కుండా నే నాలుగు వసంతాలు గడిచి పోయాయి, ఐ నా నా స్నేహితుడు లో కవి తనం నన్ను కట్టి పడేసింది. మురళీ గారి రచనలు అన్నిటినీ వదలకుండా చదువుతా.
రిప్లయితొలగించండినా మిత్రుడు కి కవితా ప్రపంచంలో ఓ మంచి గుర్తింపు రావాలని తన కవితలు కి ఆ భగవంతుడు మంచి భవిష్యత్తు చూపాలని కోరుకుంటున్నాను