నా ప్రయాణంలో ప్రకృతి సోయగం పచ్చని పొలాల మధ్య నుంచి రైలు ముందుకు సాగుతుంటే ఆకాశాన్ని తాకుతున్నట్లున్న తాటి చెట్లు వెనుకబడి పోతు నిరాశగా చూస్తున్నాయి చెరువులో నీరు పాలకడలిని తలపిస్తూ మిలమిలా మెరుస్తున్నాయి ఆకాశమార్గాన పక్షుల సమూహం కిలకిలా రాగాల నందిస్తున్నాయి నిర్మలమైన ఆకాశాన్ని సూర్యుడు చీల్చుకుంటూ కాషాయపు రంగును వెదజల్లుతూ ప్రకృతిని లేత కిరణాలతో స్పృశిస్తూ ప్రకృతిని ఆనందింప జేస్తూ తెల్లారిందంటు కోడిపుంజుకూతతో ప్రజల నిద్రమత్తు వదిలిస్తూ సమస్త జీవరాశులను మేలుకోలుపుతున్నాడు పెద్దవాళ్ళు చద్దిమూటతో పనికి పోతుంటే చిన్నారులు ఆటలకు పరిగెడుతుంటే తల్లి ఒడిలో చిన్నారి పాలు తాగుతూ తనకు తెలియని లోకంలో విహరిస్తూ తల్లి ఒడి వెచ్చదనంలో నిద్రపోతున్నాడు 16 అణాల గ్రామీణ ముద్దు గుమ్మలు ముద్దుగా బొద్దుగా కడవలతో ఒయ్యారపు నడకలతో చెరువు వద్దకు చేరుకుని చలనం లేని నీటికి కడవ తాకిడితో ప్రకంపనాలు కలిగించి యువకుల గుండెల్లో గుబులు పుట్టించారు కిటికిలో నుండి చూస్తున్న నేను కళ్ళతో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హృదయంలో పదిలపరుచుకుంటూ నా గమ్యం ...