ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

మహాభారతం

 * వ్యాసుని  తల్లిదండ్రులు : సత్యవతి, పరాశరుడు 

 వ్యాసుడు (బాదరాయణుడు ) : సంస్కృతంలో 

18 పురాణాలు, భాగవతం,భారతం వ్రాశాడు. 

ఈయన భారతాన్ని 100 పర్వాలతో, 1,20,000 ల  శ్లోకాలతో 3 సం||ల్లో వ్రాశాడు.

* భారతం శాంత రసానికి చెందింది. * భారతాన్ని వైశంపాయణుడు, జనమేజయ మహారాజుకు చెప్పెను.

భారతానికి గల ఇతర పేర్లు : పంచమవేదం, జయసంహిత, జయ కావ్యం, జయేతిహాసం

* కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు, అక్షోహిణుల సైన్యం 18, భారతంలో పర్వాలు 18, *పాండవులు 12 సం||లు అరణ్యవాసం,1సం. అజ్ఞాతవాసంలో  గడిపారు. 

* కౌరవులు, పాండవులు చంద్ర వంశ రాజులు 

*ధృతరాష్ర్టుడి కుమారులను కౌరవులంటారు. 

పాండురాజు కుమారులను పాండవులంటారు. 

*భారతాన్ని తెలుగులోకి ముగ్గురు కవులు (కవిత్రయం) వ్రాశారు వీరు భారతాన్ని 18 పర్వాలుగా వ్రాశారు. 

1) నన్నయ  21/2 పర్వాలు  ( ఆది సభా అరణ్య పర్వంలో సగభాగం) 11వ శతాబ్దం 

2) తిక్కన 15 పర్వాలు (విరాట నుంచి స్వర్గారోహణ పర్వం వరకు ) కాలం 13వ శతాబ్దం. 

3) ఎర్రన 1/2 పర్వం  (అరణ్య పర్వంలో మిగిలిన   సగభాగం)  14వ శతాబ్దం. 

*పోతన: భాగవతాన్ని తెలుగులో వ్రాశారు. ఇందులో 12 స్కంధాలున్నాయి .15వ శతాబ్దం 

*భాగవతం  భక్తి రసానికి చెందింది. *భాగవతాన్ని" సుకమహర్షి" పరిక్షిత్తు మహారాజుకు చెప్పెను.

శాంతనునికి భార్యలు ఇద్దరు- - ---- కొడుకులు 

1.గంగ.  - - - - -                భీష్ముడు (దేవదత్తుడు) 

2. సత్యవతి---------  విచిత్ర వీర్యుడు, చిత్రాంగదుడు 

సత్యవతికి ఇతరపేర్లు :మత్స్యగ్రంధి,యోజనగంధి

*విచిత్రవీర్యుని భార్యలు : అంబిక, అంబాలిక  

విచిత్రవీర్యుడు మరణించిన తర్వాత 

* వ్యాసుని వల్ల అంబికకు  ధృతరాష్రుడు,అంబాలికకు పాండురాజు, దాసికి విధురుడు జన్మించారు. 

*పాండురాజుకు  - కొడుకులు    - - - -      కోడలు 

 ఇద్దరు భార్యలు -   ఐదుగురు             

 1) కుంతి - - 1.ధర్మరాజు2.భీముడు   - -   ద్రౌపది 

                   3. అర్జునుడు 

 2 మాద్రి - - 4 నకులుడు 5 సహదేవుడు. 

* కుంతీదేవికి  దుర్వాసుడు దేవుడ్ని తలుచుకోగానే పిల్లలు పుట్టే వరం ఇచ్చాడు. 

* కుంతీదేవికి పెళ్ళికి ముందు, సూర్యుడి వల్ల కర్ణుడు, పెళ్ళి తర్వాత యముడి వల్ల థర్మరాజు, వాయువు వల్ల భీముడు, ఇంద్రుడి వల్ల అర్జునుడు జన్మించారు. కుంతీదేవి మాద్రికి చెప్పిన మంత్రం వల్ల అశ్వని దేవతల చేత నకుల,సహదేవులు జన్మించారు. 

ధృతరాష్ట్రుడికి భార్యలు

  ఇద్దరు -     కొడుకులు - -  కూతురు - - అల్లుడు 

1. గాంధారి --100 మంది - - దుశ్శల - - సైంధవుడు 

 2. సుఖద -- యుయుత్సుడు. 

*కౌరవుల,పాండవుల గురువు ద్రోణాచార్యుడు 

*ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ 

భీముడికి హిడింబికి పుట్టినవాడు ఘటోత్కచుడు. *అర్జునుడికి సుభద్రకు పుట్టినవాడు అభిమన్యుడు 

*కౌరవుల పక్షంలో మిగిలినవారు : కృతవర్మ , అశ్వత్థామ కృపాచార్యుడు. 

పాండవుల పక్షంలో మిగిలినవారు : పాండవులు, కృష్ణుడు, సాత్యకీ. 

*పాండురాజును స్ర్తీని తాకితే మరణిస్తావని "కిందాముడు" శపించాడు.

 * భీష్ముడు" అంపశయ్య మీద ఉండి "ధర్మరాజుకు" విష్ణు సహస్ర నామాలు, ధర్మం మరియు పరిపాలన గురించి వివరించాడు. భీష్మపర్వం 10 రోజులు

 * అజ్ఞాతవాస కాలంలో కౌరవులకు, పాండవులకు మధ్య జరిగిన యుద్ధం *ఉత్తర గోగ్రహణ యుద్ధం

* అర్జునుడ్ని "ఊర్వశి" బృహన్నలగా మారాలని శపించింది. * అర్జునుడు "ఉత్తరకు" నాట్యం నేర్పాడు. 

*పాండవులు అశ్వమేధయాగం, జనమేజయుడు సర్పయాగం చేశారు.

* అభిమన్యుడు పద్మవ్యూహంలో మరణించాడు. 

* భీముడితో పాటు పుట్టిన వారు : దుర్యోధనుడు, బకాసురుడు, జరాసంధుడు, కీచకుడు. 

* అర్జునుడికి ఇతర పేర్లు : అర్జునుడు, పాల్గుణుడు, పార్థుడు, కిరీటి, శ్వేతవాహనుడు, బీభత్సుడు, జిష్ణుడు, విజయుడు, సవ్యసాచి, ధనుంజయుడు. 

* పాండవులు మొదట ద్రుపదుని పురోహితుడ్ని కౌరవుల వద్దకు పంపగా, కౌరవులు విదురుడ్ని పాండవుల వద్దకు పంపారు. పాండవులు 2వ సారి కృష్ణుడ్ని కౌరవుల వద్దకు రాయబారిగా పంపారు. 

* విరాటుని       పాండవుల     వారు  చేసే పనులు 

కొలువులో.             పేర్లు  

1) ధర్మరాజు        కంకుభట్టు.            (మంత్రి) 

2) భీముడు -         వలలుడు.           (వంట) 

3) అర్జునుడు -      బృహన్నల           (నాట్యం) 

4) నకులుడు -      ధామగ్రంధి.           (ఆవులు) 

5) సహదేవుడు  -     తంత్రిపాలుడు     (గుర్రాలు) 

ద్రౌపది  - సైరంధీ (మాలినీ) 

*  పాండవుల  శంఖాల పేర్లు

 1) ధర్మరాజు  -  అనంతవిజయం 

2) భీముడు  -  పౌండ్రకం 

3) అర్జునుడు  -  దేవదత్తం 

4) నకులుడు   -  సుఘోషం 

5) సహదేవుడు - - మణిపుష్పకం

* పాండవులు అడిగిన 5 ఊళ్ళు : 

1) ఇంద్రప్రస్థం 2) కుశస్థం 3) వృకస్థలం

 4) వాసంతి 5) వారణావతం

 * భారతంలో పర్వాలు 18 : 

1) ఆది 2) సభా3) అరణ్య 4) విరాట

 5) ఉద్యోగ 6) భీష్మ 7) ద్రోణ 8) కర్ణ 9) శల్య

 10) సౌప్తిక 11) స్త్రీ 12) శాంత 13) అనుశాసన

 14) అశ్వమేధ 15) ఆశ్రమవాస 16) మౌసల 

17) మహాప్రస్థాన 18) స్వర్గారోహణ 

* పురాణాలు18 :

 1) మార్కండేయ 2) మత్స్య 3) భవిష్య

 4) భాగవత 5) బ్రహ్మ 6) బ్రహ్మవైవర్త7) బ్రహ్మండ

 8) విష్ణు 9) వాయు 10) వరాహ 11) వామన

 12) అగ్ని 13) నారద 14) పద్మ15) లింగ 

16) గరుడ 17) కూర్మ 18) స్కంద 



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

శతక లక్షణాలు, శతక కవులు

 శతక లక్షణాలు 1.సంఖ్యానియమం(100 to 108) శతకం అనగా 100 పద్యాలు,త్రిశతి  200లపద్యాలు, పంచశతి  500ల పద్యాలు,సప్తశతి  700ల పద్యాలు  2. మకుట నియమం( ఏకపద, అర్థపాద, ఏకపాద, ద్విపాద మకుటాలు)  3. రస నియమం( భక్తి, వైరాగ్యం, నీతి, శృంగారం)  4. ముక్తక నియమం : ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉండటం  5.ఛందో నియమం : వృత్త, జాతి, ఉపజాతి ఛందస్సు 6. ఆత్మాశ్రయభావన నియమం  7. ఉదాహరణలతో  వివరించటం  పద్యాలను బట్టి శతకాలను 15 రకాలుగా వర్గీకరించారు .1) భక్తి 2) శృంగార 3) నీతి  4) వేదాంత 5) హాస్య 6) చారిత్రక 7) కథా  8)చాటు 9) జీవిత చారిత్రక 10) స్వీయ చరిత్ర  11) వ్యజ్య నిందాస్తుతి 12) సమస్యాత్మక  13) నిఘంటు 14) అనువాద15) అచ్చ తెలుగు                    * శతక కవులు * 1.యథావాక్కుల అన్నమయ్య : 12వ శతాబ్దం   సర్వేశ్వర శతకం, మకుటం : సర్వేశ్వర  2.పాల్కురికి సోమన : 13వ శతాబ్దం,  వృషాధిప శతకం, రచనలు : బసవ పురాణం, బసవోదాహరణం, పండితారాధ్య చరిత్రం  3.బద్దెన :13వ శతాబ్దం, సుమతీ...

చెలి నీవెవరు

ముందుమాట " చెలి నీ వెవరు " అనే కవితా సంపుటి నిశీధివేళ ఒంటరిగా నేను స్వప్నంలో విహరిస్తుంటే మేలి జలతారు ముసుగులో తాను తారసపడి నాతో నడుస్తూ ఎన్నో ఊసులు చెబుతూ ఒంటరి తనాన్ని దూరంచేస్తూ నేనున్నానని బాస చేసి ప్రాతః సమయాన నన్ను నిద్రలేపి మాయమయ్యేది. తన మాటల్లోని భావాలను తన సుందర రూపాన్ని గుర్తు చేసుకుంటూ అరుణోదయాన అక్షరరూపం కల్పిస్తూ తనను కవితల్లో చూసుకుని మురిసిపోతూ నా దినచర్యను కొనసాగి స్తూ రాత్రి ఎప్పడౌతుందా అని ఎదురుచూస్తూ కనిపించని మనిషిని అన్వేషిస్తూ ఈ కవితా సంపుటిని వ్రాయటం జరిగింది. ఇట్లు , మీ యేటూరి మురళీకృష్ణ కుమార్ ********************************************** నేనెవరో తెలుసా పారే సెలయేరు నడుగు పండు వెన్నెల నడుగు చల్లగాలి నడుగు పరవశించే ప్రకృతి నడుగు గానానికి మైమరచిన గోవుల నడుగు గోవర్ధనగిరి నడుగు ఆరాధించే గోపికల నడుగు నన్ను ప్రేమించిన రాధ నడుగు అందరి ఆరాధ్య దేవుడిని నేను   మీ మురళీ కృష్ణుడిని నేను ***************************** చెలీ నీవెవరు ? నీ మోము చూస్తే పున్నమి నాటి చంద్రుడ్ని తలపిస్తోంది నీ నవ్వులోని స్...

దేశం - రాష్ట్రం - తెలుగు భాష ఔన్నత్యం

మన దేశం భారత దేశం మన దేశం శత్రు దుర్భేద్యమైనది భారతదేశం అలీన రధసారధి మన దేశం శాంతి సమానత్వ సౌభ్రాతృత్వం గలది మన దేశం లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యం మన దేశం భిన్నత్వంలో ఏకత్వ స్వరూపమే మన దేశం చారిత్రక కట్టడాల నిలయం మన దేశం కళలకు పుట్టినిల్లు మన దేశం నవరసాల మేళవింపు మన దేశం పున్నమి నాటి చంద్రుని వంటిది మనదేశం మన దేశం భారత దేశం ------------------------------------------------------ ఈ దేశం మనది భారతదేశ దాశ్య శృంఖలాలు తొలగించడానికి సీతారామరాజు ఝాన్సీ లక్ష్మీబాయి ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి భగత్ సింగ్ నేతాజీ వంటి వారు ఆయుధాలు ధరించి విడివిడిగా యుద్ధాలు చేసి ప్రాణాలు విడిచారు కొందరు మితవాదులు కరపత్రాల ద్వారా నినాదాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడినా ఫలితం శూన్యం లాల్ బాల్ పాల్ వంటి అతివాదులు చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు కారణం విడివిడిగా పోరాడటమే ఆయుధం ధరించిన వాడు ఆయుధంతోనే మరణిస్తాడనే విషయం గ్రహించిన గాంధీజీ సత్యం అహింస శాంతి అనే ఆయుధాలు ధరించి డూ ఆర్ డై అనే నినాదంతో ప్రజలందరిలో స్వాతంత్య్ర కాంక్షను రగుల్కోపి ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపండంటు ఒకే ...