రామాయణం 2 భాగాలు
1) రాముని జననం నుంచి పట్టాభిషేకం వరకు
2) పట్టాభిషేకం నుంచి నిర్యాణం వరకు.
ఈ రెండవ భాగాన్ని ఉత్తర రామాయణం అంటారు.
మొదటి భాగం : A ) వాల్మీకి (లేక) రత్నాకరుడు: ఈయన సంస్కృతంలో రామాయణం వ్రాసి ఆదికవి అయ్యారు. ఇందులో 6 కాండలు కలవు.1 బాల 2 అయోధ్య 3 అరణ్య 4 కిష్కింద 5 సందర 6 యుద్ధ
కాండలు. ఇందులో 24000 శ్లోకాలు కలవు. ఇది వీర రసానికి చెందింది. తెలుగులో 6 కాండలతో పాటు 7వ కాండ ఉత్తర కాండ కలదు
2వ భాగం : B) భవభూతి : ఈయన సంస్కృతంలో ఉత్తర రామాయణం వ్రాశారు.
1) కంకంటి పాపరాజు : ఉత్తర రామాయణాన్ని చంపూ కావ్యంగా వ్రాశారు.
2) గోన బుద్ధారెడ్డి : కాలం 13వ శతాబ్దం
రంగనాధ రామాయణం. ఇది తొలి తెలుగు నవల.
ఇది ద్విపదలో వ్రాయబడింది
3) తిక్కన : 13వ శతాబ్దం ఈయన నిర్వచనోత్తర రామాయణం వ్రాశారు.
4) ఎర్రన : 14 వ శతాబ్దం రచన : రామాయణం
5) హుళక్కి భాస్కరుడు : 14వ శతాబ్దం
భాస్కర రామాయణం ఇది చంపూ కావ్యం
6) మొల్ల : ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దం
రచన : మొల్ల రామాయణం. ఇందులో 6 కాండలు 900 ల పద్యాలున్నాయి
7) అయ్యలరాజు రామభద్రుడు : 16వ శతాబ్దం
రచన : రామాభ్యుదయం. ఇందులో 8 ఆశ్వాసాలు ఉన్నాయి. (ఇది రాముని చరిత్ర)
8) కూచిమంచి తిమ్మకవి : 18 వ శతాబ్దం
రచన : అచ్చ తెనుగు రామాయణం
9) గోపీనాథ వేంకటకవి : 19 వ శతాబ్దం
రచన : గోపీనాథ రామాయణం
10) వావిలికొలను సుబ్బారావు :
రచన : ఆంధ్ర వాల్మీకి రామాయణం
11) మానికొండ సత్యనారాయణ శాస్త్రి :
రచన : మానికొండ రామాయణం( తెలుగు వాల్మీకము)
12) శ్రీపాద కృష్ణమూర్తి : రచన : శ్రీకృష్ణ రామాయణం
బిరుదు : కవిసార్వభౌమ
13) విశ్వనాథ సత్యనారాయణ : బిరుదు : కవి సామ్రాట్ ; రచన : శ్రీమద్రామాయణ కల్పవృక్షం.
14) చేబ్రోలు సరస్వతీ దేవి : సరస్వతీ రామాయణం
15) గడియారం వేంకట శేషశాస్త్రి : శ్రీమదాంధ్ర రామాయణం
16) కూచిమంచి జగ్గకవి : తారకబ్రహ్మ రామాయణం
వాల్మీకి రామాయణంలో రాముడు లక్ష్మణుడ్ని దేశ బహిష్కరణ చేసిన ఘట్టం కలదు
* వాల్మీకి రామాయణంలో లేని ఘట్టాలు ఇతర రామాయణాలలో ఉన్నాయి
1 మొల్ల రామాయణం : గుహుడు రాముని కాళ్లు కడగటం
2 భాస్కర రామాయణం : సుగ్రీవ దశరధుల సంభాషణ,
యుద్ధ కాండ, మందర దుర్భోద
3 రంగనాధ రామాయణం : ఇంద్రుడు కోడై కూయటం, అహల్య రాయిగా పడి ఉండటం, ఉడుత భక్తి, లక్ష్మణరేఖ, లక్ష్మణుడి నవ్వు
* సూర్య వంశ రాజులు : వైవశ్వంతరమనువు, త్రిశంకుడు, హరిశ్చంద్రుడు, దిలీపుడు, రఘువు, అజుడు, దశరధుడు, రాముడు, కుశుడు.
* దశరథుడు అశ్వమేధ,పుత్రకామేష్టి యాగాలు, రాముడు అశ్వమేధ యాగం చేశారు.
* రాముడు 14 సం|| లు వనవాసం చేశారు.
* భరతుడు రాముని పాదుకలతో రాజ్యపాలన చేసిన గ్రామం "నందిగ్రామం".
* కైకేయికి దవళాంగుడనే ముని మాయలను ప్రక్షాళన చేసే విద్యను ప్రసాదించాడు. కైకేయి ఆ విద్యను శంబరాసురుడి పై ప్రయోగించి దశరధుని దగ్గర
2 వరాలు పొందింది. 1) రాముని వనవాసం
2) భరతునికి పట్టాభిషేకం
* సీతకు ఇతర పేర్లు : భూమజ, జానకి, మైధిలీ, అయోనిజ. * పంచవటి : 5 మర్రిచెట్లు గల ప్రదేశం .
మర్రిచెట్టును వటవృక్షం అంటారు
* దశరధునికి భార్యలు. - - - కొడుకులు - - కోడళ్ళు
ముగ్గురు - - - నలుగురు
1) కౌసల్య : శ్రీరాముడు - - సీత
2)సుమిత్ర : లక్ష్మణుడు - - - ఊర్మిళ
శతృఘ్నుడు - - - శృతకీర్తి
3) కైకేయి : భరతుడు - - - - మాండవిక
దశరధునికి కౌసల్యకు పుట్టిన కూతురు : శాంతాదేవి, అల్లుడు : ఋష్యశృంగుడు
దశరధుని కుమారులకు గురువు - - వశిష్ఠుడు
లవకుశల గురువు - - వాల్మీకి
1) రాముడు, సీతల కుమారులు : లవకుశలు
2) లక్ష్మణుడు, ఊర్మిళల కుమారులు : తక్షకుడు, చిత్రకేతుడు
3) శతృఘ్నుడు, శృతకీర్తిల కుమారులు : సుబాహుడు, శ్రుతసేనుడు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి