షిర్డీ సాయి మీ నామము మధురం మీ మాటలే వేదాంత సారం మీ చూపులే మాకు కారుణ మీ ధుని సర్వరోగ నివారిణి మీరు నడిచేది జ్ఞానమార్గం మీరు నడిపించేది ముక్తి మార్గం మీ పాదాలచెంత గంగా యమునా మీ దీవెనలే మాకు శ్రీరామ రక్ష మీ ధర్భారు నిండు ఖజానా ద్వారకామాయే మాకు శాంతి సౌధం షిర్డీయే మాకు పుణ్యక్షేత్రం సాయియే సర్వ దేవతల స్వరూపం *************************** పుట్టపర్తి సాయి ఈశ్వరమ్మ పెదవెంకమరాజులకు 1926 లో నాల్గవ సంతానంగా పాపప్రక్షాళన గావించుటకు ధరిత్రిపై కారణజన్ముడిగా సత్యనారాయణరాజు జన్మించినాడు పాలబుగ్గల పసితనంనుంచే ఆధ్యాత్మిక చింతనలో కాలంగడుపుతూ 14 వ యేట జ్ఞానిగా మారి భవబంధాలు త్యజించి సత్యసాయిబాబాగా మారి ఆధ్యాత్మిక గురువై పుట్టపర్తిలో అడుగిడి పుట్టపర్తిసాయియై పుట్టపర్తిని పుణ్యక్షేత్రంగా మా ర్చి ప్రేమతత్వమే విశ్వశాంతికి మూలమని చాటిచెప్పిన అవతారమూర్తి ఆనంద నిలయాన్ని నిర్మించి మానవసేవయే మాధవసేవంటూ ఆచరించి చూపిన యోగి విద్యా సంస్థలు నెలకొల్పి ప్రతిఇంటా అక్షర జ్యోతులు వెలిగించిన తేజోమయుడు వైద్యశాలలన...