* వ్యాసుని తల్లిదండ్రులు : సత్యవతి, పరాశరుడు వ్యాసుడు (బాదరాయణుడు ) : సంస్కృతంలో 18 పురాణాలు, భాగవతం,భారతం వ్రాశాడు. ఈయన భారతాన్ని 100 పర్వాలతో, 1,20,000 ల శ్లోకాలతో 3 సం||ల్లో వ్రాశాడు. * భారతం శాంత రసానికి చెందింది. * భారతాన్ని వైశంపాయణుడు, జనమేజయ మహారాజుకు చెప్పెను. భారతానికి గల ఇతర పేర్లు : పంచమవేదం, జయసంహిత, జయ కావ్యం, జయేతిహాసం * కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు, అక్షోహిణుల సైన్యం 18, భారతంలో పర్వాలు 18, *పాండవులు 12 సం||లు అరణ్యవాసం,1సం. అజ్ఞాతవాసంలో గడిపారు. * కౌరవులు, పాండవులు చంద్ర వంశ రాజులు *ధృతరాష్ర్టుడి కుమారులను కౌరవులంటారు. పాండురాజు కుమారులను పాండవులంటారు. *భారతాన్ని తెలుగులోకి ముగ్గురు కవులు (కవిత్రయం) వ్రాశారు వీరు భారతాన్ని 18 పర్వాలుగా వ్రాశారు. 1) నన్నయ 21/2 పర్వాలు ( ఆది సభా అరణ్య పర్వంలో సగభాగం) 11వ శతాబ్దం 2) తిక్కన 15 పర్వాలు (విరాట నుంచి స్వర్గారోహణ పర్వం వరకు ) కాలం 13వ శతాబ్దం. 3) ఎర్రన 1/2 పర్వం (అరణ్య పర్వంలో మిగిలిన సగభాగం) 14వ శతాబ్దం...