యేటూరి.పాండురంగారావుగారు ----------------------------------------- మా నాన్న గారికి బెస్ట్ E.O.అవార్డు వచ్చినందుకు ఇవే మా శుభాకాంక్షలు 26.1.2001 మా ఇంటికి బిగ్ బాస్ వృత్తిలో మెగాస్టార్ స్నేహంలో సూపర్ స్టార్ శత్రువుల గుండెల్లో రెబల్ స్టార్ అవార్డులందుకోవటంలో రియల్ స్టార్ ఈ స్టార్ ఎవరా అనుకుంటున్నారు? ఆయనే మా నాన్న వై. పి. ఆర్. పదవీ విరమణ శుభాకాంక్షలు 30.9.2001 మనలో ఒకడు మనందరివాడు మన పాండు రంగారావు ఆప్తుడై, హితుడై, బంధువై కలిసున్నాడు నేటి వరకు ఈ రోజు ఉద్యోగ బాధ్యతలు ముగిస్తూ పదవీ విరమణ గావిస్తూ మనందరిని వీడి వెళుతున్నాడు మనవాడు రేపుండకూడదు మన మధ్య దూరం ఎల్లప్పుడు కలిసుండాలి మనమందరం అందుకే మనమివ్వాలి నూతనోత్సాహం భగవంతుడివ్వాలి ఆయురారోగ్యాలు -------------------------------------------- నీరాజనం - యేటూరి. వేణుగోపాలరావు గారికి యేటూరి వంశమందు సూర్య ప్రకాశరావు దుర్గమ్మ దంపతులకు తృతీయ కుమారుడిగా జన్మించాడు మన వేణుగోపాలరావు రేపల్లె లాంటి పొణుకుమాడులో తోటి గోపబాలురతో విద్య నేర్చిన 'వేణు'మాధ...